దేశరాజధానిలో పట్టపగలే యువకుడి దారుణ హత్య | Man stabbed to death publicly by youths in Delhi's Madangir | Sakshi
Sakshi News home page

దేశరాజధానిలో పట్టపగలే యువకుడి దారుణ హత్య

Published Thu, Aug 7 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

దేశరాజధానిలో పట్టపగలే  యువకుడి దారుణ హత్య

దేశరాజధానిలో పట్టపగలే యువకుడి దారుణ హత్య

కత్తులతో దాడి చేసి హత్య..
నిందితుల్లో మైనర్లు.. సీసీటీవీలో వీడియో ఫుటేజీ

 
న్యూఢిల్లీ: ఢిల్లీలో పట్టపగలే 21ఏళ్ల యువకుడు ఐదుగురు బాల నేరస్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఆగ్నేయ ఢిల్లీలో జనంతో కిక్కిరిసిన మదన్‌గిర్ సెంట్రల్ మార్కెట్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నరకు ఈ దారుణ సంఘటన జరిగింది. ఐదుగురు బాలురు దారికాచి సచిన్ అనే యువకుడిపై కత్తులతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారని, తీవ్రంగా గాయపడిన సచిన్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారని పోలీసులు తెలిపారు. సీసీటీవీల్లో రికార్డయిన భయానక వీడియో దృశ్యాల ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులిచ్చిన ఆధారాల సాయంతో ఐదుగురినీ అరెస్ట్ చేసి, వారిపై హత్యకేసు నమోదు చేశామన్నారు.

  సచిన్ తన స్నేహితుడితో కలసి బైక్‌పై వెళ్తుండగా, ఐదుగురు బాలురు ఎదురుగా దూసుకొచ్చారు. సచిన్‌ను ఒక్కసారిగా బైక్‌నుంచి కిందకు తోసివేశారు. సచిన్ స్నేహితుడు  పారిపోగా, ఐదుగురూ సచిన్‌పై దాడిచేసి హతమార్చారు. దీనితో ఆ దారిన వెళ్తున్నవారు కూడా భయంతో హడలిపోయారు. అతన్ని రక్షించే ప్రయత్నం చేయలేకపోయారు. దాడిచేసిన వారిలో ఒకరు కత్తిని గాలిలో తిప్పుతూ, జనాన్ని బెదిరిస్తున్న దృశ్యాలు కూడా సీటీటీవీలో రికార్డయ్యాయి. తమ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురిలో 15ఏళ్ల బాలుణ్ణి పోలీసులు ప్రశ్నించగా కొన్ని విషయాలు తెలిశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement