అహ్మదాబాద్: పతంగులు ఎగురవేస్తూ వాటి పదునైన దారాలు లోతుగా గీరుకుపోవడంతో గొంతు తెగి ఓ బాలుడు(8)సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ఉత్తరాయణ్ పండగ సందర్భంగా సోమవారం ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మెహ్‌సనా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెహజీబ్ ఖాన్(8) సైకిల్‌పై వెళుతుండగా పతంగు దారం మెడకు గీసుకుపోయి చనిపోయాడు. అహ్మదాబాద్ జిల్లా ఢోల్కా సమీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న అశోక్ పంచాల్(45) కూడా పతంగు దారం గొంతుకు గీరుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. ఆనంద్ జిల్లా కత్తానా గ్రామ సమీపంలో పతంగు ఎగురవేస్తూ మెడకు దారం గీరుకుని గాయపడ్డాడు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు పతంగులు ఎగురవేసే క్రమంలో ఇళ్లపై నుంచి పడి 117 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment