సుప్రీంకోర్టులో మన్మోహన్ పిటిషన్
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసులో నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఒడిశాలోని తలాబిరా-2 బొగ్గుబ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖ లైన కేసులో మన్మోహన్‌ను నిందితుడిగా కోర్టు పేర్కొంటూ వచ్చే నెల 8న నిందితుడిగా విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇవ్వటం తెలిసిందే. తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మన్మోహన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కపిల్ సిబల్ వంటి సీనియర్ లాయర్ల బృందం ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లను దాఖలు చేసింది. మన్మోహన్ తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్‌లో లాయర్లు కోర్టుకు వివరించారు.