మావోలు అమర్చిన బాంబు పేలి కానిస్టేబుల్ మృతి | maoist set the bomb one conistable die | Sakshi
Sakshi News home page

మావోలు అమర్చిన బాంబు పేలి కానిస్టేబుల్ మృతి

Published Fri, Apr 22 2016 4:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoist set the bomb one conistable die

దుమ్ముగూడెం:  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో గురువారం ఓ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. సుకుమా జిల్లా కుంట బ్లాక్ కిష్టారం పోలీస్‌స్టేషన్ దగ్గరలోని ధర్మపేట బేస్ క్యాంప్ వాగు వద్ద ఏడాది నుంచి పోలీసుల ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణ పను లు జరుగుతున్నాయి. పనుల భద్రత కోసం 40 మందితో కూడిన ఆర్మ్‌డ్ ఫోర్స్ బలగాలు ఉదయం 11 గంటలకు అక్కడికి చేరుకున్నాయి. మావోయిస్టులు ముందుగానే అమర్చిన ప్రెషర్ బాంబుపై కానిస్టేబుల్ దినేష్ బాగాల్ కాలు వేశాడు. బాంబు ఒక్కసారిగా పేలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా జవాన్లు చెల్లాచెదురయ్యారు.  ఇదిలా ఉండగా.. అదే ప్రదేశంలో ఈ ఏడాది జనవరిలో మావోయిస్టులు ప్రెషర్ బాంబు పేల్చి ఇద్దరు పోలీసులను హతమార్చిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement