మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు దేవరాజ్
టీనగర్(చెన్నై): తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ఐదు రాష్ట్రాల కీలక నేత కుప్పు దేవరాజ్, మరో మహిళా మావోరుుస్టు మరణించారు. మరో దళ సభ్యుడు గాయాలతో తప్పించుకున్నాడు. తమిళనాడు మలప్పురం జిల్లా నిలంబూరు అటవీ ప్రాంతంలో 11 మంది మావోలు ఉన్నట్లు గురువారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి, గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి పడుక్క ప్రాంతంలోని వారి గుడారంపై పోలీసులు బాంబులు విసిరారు. మావోయిస్టులు పోలీసులపై కాల్పులకు దిగారు.
ఈ కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ నైరుతి ప్రాంత బ్యూరో సభ్యుడు, తమిళనాడు స్పెషల్ ఆర్గనైజేషన్ కమిటీ కార్యదర్శి కుప్పు దేవరాజ్(57), అజిత(38) మృతిచెందారు. మరో మావోయిస్టు సోమన్(36) గాయంతో తప్పించుకున్నాడు. ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లోని మావోరుుస్టు దళాలకు ముఖ్యనేతగా పరిగణించే కుప్పు దేవరాజ్ అలియాస్ కుప్పుస్వామి జోగేష్ అలియాస్ బాలాజీ ఆచూకీకి ఏపీ ప్రభుత్వం ఇంతకు ముందు రూ. 40 లక్షల రివార్డు ప్రకటించింది. ఎన్‌కౌంటర్‌లో దేవరాజ్, అజితలు మరణించినట్లు మలప్పురం డీఎస్పీ ధృవీకరించారు.
తమిళనాడులో మావోయిస్టుల ఎన్‌కౌంటర్
Published Sat, Nov 26 2016 4:33 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
Advertisement
Advertisement