తవ్వుకున్న గొయ్యిలో పడి నక్సల్స్ మృతి | Maoists killed three in landmine explosion | Sakshi
Sakshi News home page

తవ్వుకున్న గొయ్యిలో పడి నక్సల్స్ మృతి

Published Sun, Apr 17 2016 8:45 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

తవ్వుకున్న గొయ్యిలో పడి నక్సల్స్ మృతి - Sakshi

తవ్వుకున్న గొయ్యిలో పడి నక్సల్స్ మృతి

 చింతూరు: 'తాము తవ్విన గోతిలో తామేపడ్డ' చందంగా పోలీసులను హతమార్చేందుకు మందుపాతర అమర్చుతూ అది పేలడంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల కథనం ప్రకారం..

ఈ నెల 15న దండకారణ్యం బంద్ పిలుపులో భాగంగా తమ ప్రభావిత ప్రాంతమైన కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. రహదారుల పొడవునా కందకాలు తవ్వడంతోపాటు చెట్లు నరికి దారికి అడ్డంగా పడేశారు. ఇదే క్రమంలో కూంబింగ్ నిర్వహించడానికి వచ్చే పోలీసులను లక్ష్యం చేసుకుని.. కొయిలీబేడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మర్కానార్ గ్రామ రహదారి మందుపాతరను అమర్చేప్రయత్నం చేశారు. అయితే ప్రమాదవశాత్తు మందుపాతర పేలిపోవడంతో ముగ్గురు నక్సల్స్ మందుపాతరకోసం తవ్విన గోతిలోనేపడి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు. చనిపోయిన వారిలో మావోయిస్టు కమాండర్ అర్జున్‌ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement