న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళనకు రూపొందించిన బృహత్ ప్రణాళికను కేంద్రం సోమవారం సుప్రీంకోర్టు ముందుంచింది. స్వల్ప, మధ్య, దీర్ఖకాలిక చర్యలతో తయారు చేసిన నమూనా ప్రణాళికను అఫిడవిట్ రూపంలో సమర్పించింది. దీని అమలుకు 18సంవత్సరాల వ్యవధి, వేలాది కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని పేర్కొంది. నది తీరం వెంబడీ 2,500కిలోమీటర్ల పొడవునా ఉన్న 118 పట్టణాల్లో సంపూర్ణ స్థాయిలో పారిశుద్ధ్య పరిస్థితులను నెలకొల్పడం తమ తొలి లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.