రైతుల నిరసనలు తీవ్రతరం | Milk Vegetable Supplies May Hit Due To Farmers Agitation  | Sakshi
Sakshi News home page

రైతుల నిరసనలు తీవ్రతరం

Published Wed, Jun 6 2018 7:31 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Milk Vegetable Supplies May Hit Due To Farmers Agitation  - Sakshi

దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనతో నిత్యావసరాల సరఫరాలకు అవాంతరం

సాక్షి, పూణే : డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన రైతుల ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. జూన్‌ 1 నుంచి 10 వరకూ సమస్యల పరిష్కారం కోరుతూ అన్నదాతలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల ఏడు నుంచి ఆందోళనను ఉధృతం చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) నిర్ణయించడంతో మహారాష్ట్రలో ముంబయి సహా ప్రధాన నగరాల్లో పండ్లు, కూరగాయలు, పాల సరఫరాల్లో ఇబ్బందులు ఎదురవనున్నాయి.

ఇప్పటికే ఆయా ఉత్పత్తుల సరఫరాలకు అవాంతరాలు ఎదురవడంతో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల ధరలు ప్రధాన నగరాల్లో భగ్గుమంటున్నాయి. రైతు నిరసనలు తీవ్రరూపు దాల్చితే ఇబ్బందికరమేనని వర్తకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్త ఆందోళనను తీవ్రతరం చేస్తామని జూన్‌ 10 వరకూ ధర్నాలు, రాస్తారోకోలు, ఘోరావ్‌లు, భారీ ప్రదర్శనలతో హోరెత్తిస్తామని ఏఐకేఎస్‌ మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్‌ నవాలే తెలిపారు. ఆందోళనలో భాగంగా నిత్యావసరాల విక్రయాలను తాము అడ్డుకోబోమని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement