'సచిన్ కంటే ముందు ధ్యాన్చంద్కే భారతరత్న ఇవ్వాలి' | Milkha Singh says DhyanChand deserved BharatRatna before Sachin Tendulkar | Sakshi

'సచిన్ కంటే ముందు ధ్యాన్చంద్కే భారతరత్న ఇవ్వాలి'

Nov 23 2013 4:05 PM | Updated on Sep 2 2017 12:54 AM

'సచిన్ కంటే ముందు ధ్యాన్చంద్కే భారతరత్న ఇవ్వాలి'

'సచిన్ కంటే ముందు ధ్యాన్చంద్కే భారతరత్న ఇవ్వాలి'

దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు అర్హుల ఎంపికపై వివాదం కొనసాగుతోంది.

దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న అవార్డు అర్హుల ఎంపికపై వివాదం కొనసాగుతోంది. ఈ జాబితాలో తాజాగా భారత అథ్లెట్ దిగ్గజం మిల్కాసింగ్ చేరాడు. బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కంటే ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్కు భారతరత్నఇవ్వాలని అన్నాడు. సచిన్కు అవార్డు ఇవ్వడాన్ని తాను వ్యతిరేకించడం లేదని, అయితే ధ్యాన్చంద్ను మొదటు అవార్డుతో గౌరవిస్తే సంతోషిస్తానని మిల్కాసింగ్ చెప్పాడు. సచిన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించాడు.

భారతరత్న అవార్డీల జాబితాలో క్రీడాకారులను తొలిసారి చేర్చడం పట్ల మిల్కాసింగ్ హర్షం వ్యక్తంచేశాడు. చాలామంది ప్రముఖులు సచిన్కు భారతరత్న ఇవ్వడాన్ని వ్యతిరేకించకపోయినా.. మాజీ ప్రధాని వాజ్పేయి, ధ్యాన్చంద్ను సత్కరించకపోవడాన్ని విమర్శిస్తున్నారు. వీరిద్దరికి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. సచిన్ రిటైర్మెంట్ రోజునే అతనికి భారతరత్న అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement