న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా పాలు పంపిణీ చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐఏఎస్ అధికారి నితిన్ సవాంగ్ శుక్రవారం షేర్ చేశారు. ఈ ఫొటోకు ‘ఈ వ్యక్తి కరోనా నుంచి తనను మాత్రమే సురక్షితంగా ఉంచడమే కాకుండా ఇతరులను కూడా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించిన తీరు ప్రశంసనీయం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేగాక ‘‘మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ ఇంట్లోనే ఉండటం, మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజ్‌లు ధరించడం చేస్తున్నారు. కానీ ఇతడిలా ఏ ఒక్కరూ కూడా ఆలోచించి ఉండరు’’ అంటూ రాసుకొచ్చారు. (ఇర్ఫాన్ విషయంలో పెద్ద తప్పు చేశా: నటుడు)
Good to see that some people go extra mile to keep themselves and others safe.
— Nitin Sangwan, IAS (@nitinsangwan) May 7, 2020
Let's do basic minimum things of staying at home, wearing mask and keeping social distance even if we cannot go an extra mile like this innovative milkman. pic.twitter.com/RrjYVtdaKW
ఈ ఫొటోలో ఆ వ్యక్తి తన మోటారు సైకిల్‌పై పాలు పంపిణీ చేస్తున్నాడు. అతను చేతులకు గ్లౌజ్‌లు, మొహనికి మాస్క్‌లు, ధరించడమే కాకుండా తన కస్టమర్ల నుంచి భౌతిక దూరం పాటించడానికి వినూత్న ఆలోచన చేశాడు. తన మోటరు సైకిల్ పోడవైన పైపును అమర్చి చేసి వినియోగదారులకు పాలు పోయడానికి ఉపయోగించిన అతని ఆలోచనకు నెటిజన్లంతా ఫిదా అవుతన్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మార్చి నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌లో వివిధ పరిశ్రమలు, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం నిత్యవసర సేవలకు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. (పెళ్లిపై స్పందించిన సల్మాన్ ప్రియురాలు!)
Comments
Please login to add a commentAdd a comment