సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయంలో ఈ వేకువ ఝామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఏ ప్రమాదం చోటు చేసుకోలేదని సమాచారం.
ఉదయం 3.35 నిమిషాల సమయంలో రెండో ఫ్లోర్‌లోని గది నంబర్ 242లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఓ సెక్షన్ అధికారికి ఆ రూమ్‌లోని కంప్యూటర్ యూపీఎస్ నుంచి మంటలు రావటంతో ఘటన చోటు చేసుకుందని నిర్ధారించారు.
సమాచారం అందుకున్న వెంటనే 20 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసి కేవలం 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు డివిజినల్ ఫైర్ అధికారి గుర్ముఖ్ సింగ్ తెలిపారు. కాగా, స్వల్ఫ ప్రమాదమేనని.. అధికారిక రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment