pmo of India
-
రాష్ట్రపతి ముర్ముకు మిస్డ్‌కాల్
న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌ను వాడే అలవాటు అంతగా లేని ద్రౌపదీ ముర్ము.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఫోన్‌కాల్‌ను మిస్సయ్యారు..! ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు అది. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఆమెను కోరేందుకు స్వయంగా ప్రధాని మోదీయే చేసిన కాల్ అది..! ‘ద్రౌపదీ ముర్ము: ఫ్రం ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టూ రైజినా హిల్’ పేరుతో జర్నలిస్ట్ కస్తూరి రే రాసిన తాజా పుస్తకంలో 2022 జూన్ 21న జరిగిన ఘటన సహా పలు వివరాలున్నాయి. పలు ఇంటర్వ్యూలు, విశ్లేషణల ఆధారంగా ముర్ము జీవితంలో ఘటనల క్రమాన్ని స్కూల్, కాలేజీ రోజులవరకు టీచర్ నుంచి సామాజిక కార్యకర్తగా, అటునుంచి కౌన్సిలర్..మంత్రి..గవర్నర్..దేశ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి వరకు సాగిన ఆమె ప్రస్థానాన్ని అందులో ప్రస్తావించారు. గతేడాది జూన్ 21న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 275 కిలోమీటర్ల దూరంలోని తన మారుమూల స్వగ్రామం ఉపర్‌బేడలో ముర్ము ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము అని తెలిసినా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీని కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయమది. అయితే, ముర్ము స్వగ్రామంలో కరెంటు కట్ అమలవుతోంది. బయట జరుగుతున్న ఇలాంటి విషయాలేవీ ఆమెకు తెలియవు. మొబైల్‌ను ఎక్కువగా వాడే అలవాటు లేని ముర్ము, దాన్ని ఎక్కడో ఉంచారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ సహా ప్రముఖ వ్యక్తుల నుంచి వచ్చిన అనేక ఫోన్‌కాల్స్‌ను ఆమె రిసీవ్ చేసుకోలేకపోయారు. చివరికి పీఎంఓ అధికారులు ముర్ము మాజీ ఓఎస్డీ, రాయ్రంగ్పూర్లో ఉంటున్న బికాశ్ చంద్ర మహంతకు ఫోన్ చేశారు. ఆయన ఆగమేఘాల మీద తన మెడికల్ షాపును మూసేసి ముర్ము ఇంటికి చేరుకున్నారు. ఫోన్ ఆమె చేతికందించారు. దీంతో ప్రధాని మోదీతో ఆమె నేరుగా మాట్లాడగలిగారు. ఆ తర్వాతే ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
నా కోసం.. నా ప్రధాని
ఇలాంటప్పుడే.. ప్రభుత్వం ఎక్కడో ఢిల్లీలో లేదు, మన ఇంటి పక్కనే ఉందన్న నమ్మకం కలుగుతుంది. సుమేర్ సింగ్‌ది జైపూర్. ఆయన కూతురు లలిత్‌కి కొన్నాళ్లుగా ఒంట్లో బాగోలేదు. కూతురంటే మరీ చిన్న పిల్ల కాదు. టీనేజ్ అమ్మాయి. బాగోలేక పోవడం అంటే ఎంతకూ తగ్గని జ్వరమో, తలనొప్పో కాదు. అప్లాస్టిక్ అనీమియా! ‘మనిషి ఒంట్లో ఎప్పటికప్పుడు రక్తకణాలు పుట్టుకొస్తుండాలి. మీ అమ్మాయిలో అలా లేదు. దీనివల్లే ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం తగ్గట్లేదు. రక్తకణాలను తయారు చేసేది ఎముకల్లోని మూలుగ. ఆ మూలుగను వేరే మనిషి నుంచి తీసుకుని మీ అమ్మాయి వేస్తే తిరిగి రక్తకణాల వృద్ధి మొదలవుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. మూలుగను మార్చాలంటే సుమారు 10 లక్షల రూపాయల వరకు అవుతుంది’’ అని డాక్టర్లు చెప్పారు. అప్పటికే సుమేర్ తన కూతురి వైద్యం కోసం భూమిని అమ్ముకున్నాడు. ఇంటిని తనఖా పెట్టాడు. 7 లక్షల రూపాయలు వరకు ఖర్చు పెట్టాడు. అయినా నయం కాలేదు. ఆ తండ్రి దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘‘నా కూతురికి ఇక ఎప్పటికీ బాగయే అవకాశం లేకపోతే నేను చచ్చిపోతాను’’ అన్నాడు ఓ రోజు. అప్పుడే డాక్టర్లు చెప్పారు మూలుగ మార్పిడి చేయించగలిగితే పిల్ల బతుకుతుందని. మూలుగ ఇవ్వడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. ఇక కావలసింది పది లక్షలు. అంత డబ్బు ఎవరిస్తారు? ప్రధాన మంత్రికి ఉత్తరం రాయమని చదువుకున్న వాళ్లెవరో సలహా ఇచ్చారు. సమేర్ తన కూతురు పరిస్థితి, తన ఆర్థిక దుస్థితి వివరిస్తూ నరేంద్ర మోదీ పేరిట ఉత్తరం రాశారు. ఆ ఉత్తరానికి స్పందించిన ప్రధాని కార్యాలయం ‘జాతీయ సహాయ నిధి’ నుంచి సమేర్ కూతురి చికిత్స కోసం 30 లక్షల రూపాయలను విడుదల చేసింది! సమేర్ సహాయం అడిగితే ఏకంగా వరమే లభించింది. ఈ డబ్బుతో అతడికి కూతురికి నయమవడమే కాదు, అతడి అప్పులూ తీరుతాయి. తను అమ్మిన భూమిని తిరిగి తనే కొనుక్కోగలడు. తనఖా పెట్టిన ఇంటిని విడిపించుకోగలడు. ఇలాంటప్పుడే అనిపిస్తుంది.. ఢిల్లీ మన కాలనీలోనే ఉందని! ప్రధాని రోజూ మన ఇంటి వైపు చూస్తూ డ్యూటీకి వెళుతున్నారని. పరామర్శించడానికి కూడా ఎప్పుడో ఇంటి లోపలికి కూడా రానే వచ్చేస్తారని. -
అకాల వర్షాలు : ప్రధాని తీరుపై విపక్షం ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, రాజస్ధాన్, గుజరాత్, మహారాష్ట్రలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో 34 మంది మరణించారు. అకాల వర్షాలు నాలుగు రాష్ట్రాలను ముంచెత్తడంతో భారీ నష్టం వాటిల్లింది. మధ్యప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షంతో 11 మంది మృత్యువాతన పడ్డారు. ఖర్గోనే జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు వందలాది ఇళ్లు నీటమునిగాయి. జముదిర్ సర్వార్ గ్రామంలో పిడుగుపాటుతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఇక గుజరాత్లో భారీ వర్షాలు, పిడుగుపాటుకు 9 మంది మరణించారు. మెహసనా, బనస్కంత, సబర్కంత ప్రాంతాల్లో భారీ వర్షాలతో భారీగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు మహారాష్ట్రలో భారీ వర్షాలు, పిడుగుపాటు కారణంగా ఏడుగురు వ్యక్తులు మరణించారు. నాసిక్, పుణేలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. రాజస్ధాన్‌లో భారీ వర్షాలకు ఏడుగురు వ్యక్తులు మరణించారు. అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పెద్దసంఖ్యలో మట్టిఇళ్లు దెబ్బతిన్నాయి. మోదీపై భగ్గుమన్న కాంగ్రెస్ గుజరాత్లో భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ, పంట నష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. కాగా గుజరాత్ సహా నాలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తే ప్రధాని కేవలం గుజరాత్‌నే ప్రస్తావించడం పట్ల విపక్ష కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం సంతోషమే..కానీ కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లోనూ అకాల వర్షాలతో ప్రాణ నష్టం జరిగిందని, ఇక్కడ బీజేపీ అధికారంలో లేకపోయినా తమ రాష్ట్రంలో అకాల వర్ష బాధితులకు కూడా ప్రధాని సంతాపం తెలపాలని ఆ రాష్ట్ర సీఎం కమల్ నాధ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో బాధితులకు ఎలాంటి సాయం చేయని ప్రదాని గుజరాత్ పట్ల పక్షపాతం చూపారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఆక్షేపించారు. -
సీబీఐ డైరెక్టర్ల మధ్య తారస్థాయికి చేరిన విబేధాలు
-
ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కార్యాలయంలో ఈ వేకువ ఝామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఏ ప్రమాదం చోటు చేసుకోలేదని సమాచారం. ఉదయం 3.35 నిమిషాల సమయంలో రెండో ఫ్లోర్‌లోని గది నంబర్ 242లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఓ సెక్షన్ అధికారికి ఆ రూమ్‌లోని కంప్యూటర్ యూపీఎస్ నుంచి మంటలు రావటంతో ఘటన చోటు చేసుకుందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న వెంటనే 20 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసి కేవలం 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు డివిజినల్ ఫైర్ అధికారి గుర్ముఖ్ సింగ్ తెలిపారు. కాగా, స్వల్ఫ ప్రమాదమేనని.. అధికారిక రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
'సంక్షేమం'తోనే ప్రజల మద్దతు
బీజేపీ కార్యకర్తలతో ప్రధాని మోడీ {పధాని అయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి.. పార్టీని గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు న్యూఢిల్లీ: ‘ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేయడమనే పరీక్షలో పాసైతే ప్రజలు మనల్ని కొనియా డతారు. మన వెంట ఉంటారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలకు ఉద్బోధించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతర్ప్రవాహం, ఒకే భావధార లేకపోయినట్లయితే బీజేపీకి అఖండ విజ యం సాధ్యమయ్యేది కాదన్నారు. మోడీ ప్రధాని పద వి చేపట్టాక తొలిసారి ఆదివారం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని కార్యకర్తలతో ముచ్చటించారు. బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర నేతలు కూడా పాల్గొని ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసినందుకు మోడీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. వారు గొప్పవారని, వారి కఠిన శ్రమ వల్లే ప్రధానిని అయ్యానన్నారు. ‘ప్రజలు వారి ఆకాంక్షలు నెరవేస్తామనే ఆశతో కులమతాలు, రాజకీయ సమీకరణాలకు అతీతంగా మనకు ఓటేశారు. వారి ఆకాంక్షలను నిబద్ధతతో నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తోందని ప్రజలు విశ్వసిస్తే వారు పార్టీతో సంబంధాలను ఎన్నటికీ తెంచుకోరు’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్ నాయకత్వంలో లేబర్ పార్టీ, తొలి పర్యాయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా విజయం సాధించినట్లుగా బీజేపీ గెలిచిందని, దీనిపై రాజకీయ విశ్లేషకులు, సామాజిక శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి, పుస్తకాలు వెలువరించాల్సిన అవసరముందన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి తొలిసారి ప్రధాని అయ్యాక పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చినప్పుడు తనకెంతో సంతోషం కలిగిందని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సన్నాహాల కోసం కార్యకర్తలా కష్టపడ్డానన్నారు. ‘పార్టీ కార్యాలయానికి రావాలని వాజ్‌పేయిని అడగ్గా, ఎందుకని ఆయన తిరిగి అడిగారు. మీరిప్పుడు ప్రధాని, కార్యకర్తల చెంత మీరుంటే వారు సంతోషిస్తారు అని చెప్పా.. ఇప్పుడు మీరు నాకిచ్చిన గౌరవాన్ని ఊహించుకోలేపోతున్నా’ అని ఉద్వేగంగా అన్నారు. దేశ శక్తి గురించి లోకానికి తెలిసింది ప్రధానిగా తన ప్రమాణ స్వీకారానికి దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి(సార్క్) దేశాధినేతలను ఆహ్వానించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని మోడీ పేర్కొన్నారు. తన ఈ తొలి విదేశాంగ విధాన చొరవ వల్ల భారత్ శక్తి గురించి ప్రపంచానికి సందేశం వెళ్లిందన్నారు. అందరూ ప్రశంసిస్తున్న ఈ నిర్ణయం గురించి ప్రపంచం ఇప్పటికీ మాట్లాడుకుంటోందన్నారు. మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తే అది మన దేశానికి తగిన గౌరవం ఇస్తుందన్నారు. నేడు మంత్రులతో మోడీ భేటీ న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలికి ఇప్పటికే 100 రోజుల అజెండాను నిర్దేశించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సమర్థ పరిపాలన, ప్రభుత్వ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం నాడు తన మంత్రివర్గ సహచరులందరితో సమావేశం కానున్నారు. పెట్టుబడుల పెంపుదల, నిర్ణీత కాల పరిమితిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పూర్తి, సహజ వనరుల సమర్థ వినియోగం తదితర పది సూత్రాల అజెండాను నిర్దేశించుకున్న మోడీ.. ఆయా అంశాలపై 44 మంది మంత్రుల నుంచి సూచనలు కోరే అవకాశముంది. ఈ సమావేశంలో చర్చకు వచ్చే ముఖ్యాంశాలు నాలుగో తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ఉభయసభల సమావేశాల్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగంలో ప్రతిఫలించనున్నాయి. పీఎంఓ పేజీకి 11 లక్షల లైక్‌లు ప్రధానమంత్రి కార్యాలయం ఫేస్బుక్ పేజీ ‘పీఎంఓ ఇండియా’ ఆరంభంలోనే అదరగొట్టింది. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే దీనికి 11 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడే ప్రధాని మోడీ విధుల్లో ఉన్న ఫోటో పేజీ ముఖచిత్రంగా ఉంది. మోడీని పలువురు ప్రముఖులు అభినందిస్తున్న ఫోటోలు, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఆయనిచ్చిన సందేశాన్ని పీఎంఓ ఇందులో పోస్ట్ చేసింది. ఈ సందేశాన్ని వేలాది మంది ఇష్టపడ్డారు.