అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ
థానే: అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. ఆ సంస్థలో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే కొందరు ఉద్యోగులు వారం కిందట కొన్ని విలువైన మొబైల్స్ ను చోరీ చేశారు. థానేలోని కురుంద్ లో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలు వెల్లడించారు. మే 22న కొందరు ఉద్యోగులు 17 మొబైల్ హ్యాండ్ సెట్లను దొంగిలించారు. అయితే వాటి విలువ రూ.10 లక్షలకు పైమాటేనని అమెజాన్ సంస్థ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్టోరేజ్ హౌస్ లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ జైప్రకాష్ బోసాలే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే మే 29న మరో కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.8 వేలు విలువ చేసే మొబైల్ ను స్టోరేజ్ హౌస్ నుంచి చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఆ ఉద్యోగి పేరు ఆకాశ్ సపాత్ అని, ఐపీసీ సెక్షన్లు 381, 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు బోసాలే పేర్కొన్నారు.