mobiles stolen
-
ఆలీబాబా అరడజను దొంగలు.. ప్లాన్ ఒకరు అమలు చేసేది మరొకరు
సాక్షి,కర్నూలు: నగరంలో సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బబ్లూ బ్యాచ్, వడ్డె ప్రసాద్ బ్యాచ్ పేరుతో ఎనిమిది మంది కొంతకాలంగా నగరంలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన కొత్తూరు శేఖర్‌రెడ్డి తన ద్విచక్ర వాహనాన్ని కర్నూలులో రిపేరికి ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్లేందుకు నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఆటో ఎక్కాడు. అదే దారిలో కొంచెం ముందుకు వెళ్లిన తరువాత సర్వీసు రోడ్డులో నుంచి చీకట్లోకి తీసుకెళ్లి రూ.5 వేలు నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. అలాగే తుగ్గలికి చెందిన జయచంద్ర రిలయన్స్ మార్ట్‌లో పనిచేస్తాడు. కేసీ కెనాల్ వద్ద అతని వద్ద నుంచి రూ.6 వేల నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి శ్రీధర్‌పై కూడా ఈ తరహాలోనే దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కున్నారు. రెండు నెలల వ్యవధిలో ఈ తరహా మూడు కేసులు నమోదు కావడంతో మూడో పట్టణ ఎస్ఐ రామకృష్ణ, క్రైంపార్టీ సిబ్బంది ప్రసాద్‌సింగ్, చంద్రబాబునాయుడుతో కలిసి నిఘా వేసి పవన్ అలియాస్ బబ్లూ, వడ్డె ప్రసాద్(శ్రీరామ్‌నగర్)లతో పాటు కావేటి ఈశ్వరయ్య (లక్ష్మీనగర్), దాస్(జంపాల శివనగర్), అఖిల్ (ఎన్టీఆర్ బిల్డింగ్స్), మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నారు. చోరీ చేసిన సెల్ఫోన్లను అమ్మ హాస్పిటల్‌కు సమీపంలోని సాయి మొబైల్స్‌లో సెల్‌ఫోన్ మెకానిక్ గౌడుకు విక్రయించినట్లు అంగీకరించారు. నిందితుల నుంచి 10 సెల్ఫోన్లతో పాటు ఆటో, స్కూటర్ స్వాధీనం చేసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. చదవండి: భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే.. -
ఆటో మొబైల్ దొంగల ముఠా అరెస్ట్: సీపీ
సాక్షి, హైదరాబాద్: ఆటో మొబైల్, మొబైల్ దొంగతనాలు చేస్తున్న 11 మంది గ్యాంగ్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు అమీర్‌ఖాన్‌తో పాటు మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. దొంగతనాలు చేస్తున్న ఈ ముఠాలో ఓ మైనర్ కూడా ఉన్నాడని సీపీ అంజనీకుమార్ తెలిపారు. దొంగిలించిన వస్తువులను ఈ ముఠా నుంచి తీసుకుంటున్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై సుమారు 33 కేసులు ఉన్నాన్నాయని ఆయన వెల్లడించారు. 27 బైక్‌లు, 5 సెల్ ఫోన్లు, 1 ఆటోను పోలీసుల స్వాధీనం చేసుకున్నారని సీపీ వెల్లడించారు. ఈ ముఠాలో ఏ1 దొంగ అమీర్‌ఖాన్ మెకానిక్‌గా పని చేశాడు. దీంతో తాళం లేకుండా బైక్‌లు ఎలా దొంగలించాలో బాగా నేర్చుకున్నాడని సీపీ అంజనీకుమార్ వివరించారు. అలాగే గ్యాంగ్‌కి మొత్తానికి నేర్పించి బైక్ దొంగతనాలకి పాలపడుతున్నారని ఆయన తెలిపారు. సైఫాబాద్‌లో నమోదైన కేసును విచారణ చేస్తుండగా.. ఈ గ్యాంగ్ వ్యవహారం అంతా బయటపడిందని సీపీ వెల్లడించారు. గత నాలుగు నెలలుగా వీళ్లు చోరీలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో ఎక్కడ ఈ గ్యాంగ్ పట్టుబడలేదని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మీటింగ్ గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. దక్షిణ, పశ్చిమ జోన్ ప్రజలతో ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ నిర్వహించామని అయన చెప్పారు. ఒక్కో చోట ఒక్కో సమస్య ప్రజలకు ఉందని.. కాబట్టి విజన్ 2020లో ప్రజలు స్వచ్ఛందంగా పోలీసులకు సహకారం అందించాలని సీసీ అంజనీకుమారు కోరారు. ప్రజల్లో వారి రక్షణ కోసం స్వతహాగా కొత్త విధానం ఏర్పడాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు. -
అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ
థానే: అమెజాన్ గోడౌన్ లో భారీ చోరీ జరిగింది. ఆ సంస్థలో కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే కొందరు ఉద్యోగులు వారం కిందట కొన్ని విలువైన మొబైల్స్ ను చోరీ చేశారు. థానేలోని కురుంద్ లో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలు వెల్లడించారు. మే 22న కొందరు ఉద్యోగులు 17 మొబైల్ హ్యాండ్ సెట్లను దొంగిలించారు. అయితే వాటి విలువ రూ.10 లక్షలకు పైమాటేనని అమెజాన్ సంస్థ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టోరేజ్ హౌస్ లో పనిచేసే ఐదుగురు ఉద్యోగులు ఈ పని చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అరెస్ట్ చేయలేదని, దర్యాప్తు ప్రారంభించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ జైప్రకాష్ బోసాలే తెలిపారు. ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు. అయితే మే 29న మరో కాంట్రాక్ట్ ఉద్యోగి రూ.8 వేలు విలువ చేసే మొబైల్ ను స్టోరేజ్ హౌస్ నుంచి చోరీ చేస్తూ దొరికిపోయాడు. ఆ ఉద్యోగి పేరు ఆకాశ్ సపాత్ అని, ఐపీసీ సెక్షన్లు 381, 511 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు బోసాలే పేర్కొన్నారు.