‘మోడీ, అద్వానీ, అఖిలేష్‌లను చంపేస్తాం’ | 'Modi, Advani,akhilesh waring to Intruder | Sakshi
Sakshi News home page

‘మోడీ, అద్వానీ, అఖిలేష్‌లను చంపేస్తాం’

Published Sat, May 24 2014 1:24 AM | Last Updated on Wed, Aug 29 2018 8:07 PM

‘మోడీ, అద్వానీ, అఖిలేష్‌లను చంపేస్తాం’ - Sakshi

‘మోడీ, అద్వానీ, అఖిలేష్‌లను చంపేస్తాం’

నరేంద్ర మోడీ, బీజేపీ నేత అద్వానీ, యూపీ సీఎం అఖిలేష్, బీఎస్పీ నేత మాయావతిలను చంపుతామంటూ ఓ అగంతకుడు హెచ్చరిక లేఖ రాశాడు. జూన్ 20 నాటికి వీరికి ప్రాణహాని తప్పదని యూపీలోని ఘజియాబాద్ రైల్వే పోలీసులకు లేఖ పంపాడు. పలు రైల్వే స్టేషన్లు, దేవాలయాల్లో బాంబులు అమర్చినట్టు పేర్కొన్నాడు. రైల్వే ఎస్పీకి గురువారం అందిన లేఖలో వివరాలను ఎస్పీ శివహరి తెలిపారు. 

లేఖలో పేర్కొన్న ప్రకారం ఢిల్లీ, ఘజియాబాద్, బులంద్‌షార్, కాన్పూర్, మధుర, భోపాల్ రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టారు. వీటిని జూన్ 15న పేల్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఢిల్లీలోని కాళీ ఆలయం, ఘజియాబాద్‌లోని దూడేశ్వర్ నాథ్, జానకి ఆలయంలోనూ బాంబులు అమర్చినట్టు ఆగంతకుడు హెచ్చరించాడు. దీంతో అలెర్టయిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement