జమ్ము కాశ్మీర్ చేరుకున్న ప్రధాని మోదీ | Modi arrives in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్ము కాశ్మీర్ చేరుకున్న ప్రధాని మోదీ

Published Tue, Apr 19 2016 10:11 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Modi arrives in Jammu and Kashmir

జమ్ము: జమ్ము కాశ్మీర్లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం జమ్ము ఎయిర్ పోర్టు చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ చేరుకున్న మోదీకి రాష్ట్ర గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మహాబూబా ముఫ్తీ, డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు స్వాగతం తెలిపారు.

అనంతరం ఎమ్ఐ 17 హెలికాప్టర్లో ఆయన కాట్రా పట్టణానికి బయలుదేరారు. ఆయన వెంటన గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారు. ఈ రోజు జరగనున్న శ్రీ మాతా వైష్ణో దేవి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్లొనున్నారు. అలాగే 250 పడకల సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement