కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో ప్రధానమంత్రిపై విరుచుకుపడింది. ప్రధాని మోదీ నిత్యం చేపడుతున్న విదేశీ పర్యటనలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. మోదీ తాను భారతీయ నివాసియా లేక, ఎన్నారై అన్నది తేల్చుకోవాలని ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ప్రశ్నించింది. అసోంలో మాత్రమే బీజేపీ గెలిచిందని, మిగతా నాలుగు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, అయినా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పెద్ద ఎత్తున సంబురాలకు సిద్ధమవుతున్నారని సామ్నా తన సంపాదకీయంలో ఎద్దేవా చేసింది.
మోదీ అధికారంలోకి వచ్చి పలు పథకాలు ప్రకటించినా అవేవీ సామాన్యులకు చేరలేదని, విదేశాల్లోని నల్లధనాన్ని రప్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కీలక చర్యలు తీసుకోలేదని విమర్శించింది. మిత్రపక్షమైనప్పటికీ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై శివసేన గత కొన్నాళ్లుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.
మోదీ ఇండియన్ రెసిడెంటా? లేక ఎన్నారై?!
Published Thu, May 26 2016 1:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement