రెండోస్సారి... | modi suit taken high rate in market | Sakshi
Sakshi News home page

రెండోస్సారి...

Published Fri, Feb 20 2015 12:54 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM

modi suit taken high rate in market

 సూరత్: ప్రధాని మోదీ బంద్‌గలా సూటు ధర పైపైకి ఎగబాకుతోంది! బుధవారం నాటి వేలంలో రూ.1.21 కోట్లు పలికిన బిడ్డింగ్.. గురువారం ఏకంగా రూ.1.48 కోట్లకు పెరిగింది. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేశ్ పటేల్ ఈ భారీ మొత్తాన్ని కోట్ చేశారు. గురువారం రూ.1.25 కోట్లతో వేలం ప్రారంభమైంది. ఆ వెంటనే ముకేశ్ పటేల్ రూ.1.39 కోట్లు పలికారు. లీలా గ్రూప్ సీఎండీ కోమల్‌కాంత్ రూ.1.41 కోట్లు కోట్ చేశారు. అనంతరం ముకేశ్ మరో రూ.7 లక్షలు పెంచారు. శుక్రవారం కూడా ఈ వేలం కొనసాగనుంది. ‘‘మోదీ చేపట్టిన గంగా ప్రక్షాళన కార్యక్రమం ఎంతో నచ్చింది. ఆయన సీఎంగా ఉన్నప్పుడూ బహుమతులను వేలంలో అమ్మి బాలికల విద్య కోసం ఇచ్చారు. ఇప్పుడూ ఓ మంచి కార్యక్రమం కోసం వేలం పెట్టినందున ఆ కోటును కొనాలనుకుంటున్నా’’అని ముకేశ్ చెప్పారు. ఇక గురువారమే కోటుకు రూ.1.25 కోట్లు కోట్ చేసిన రాజేశ్ మహేశ్వరి అంతకన్నా ముందుకు వెళ్లలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement