చికిత్స పొందుతున్న చిన్నారి
భువనేశ్వర్: 16 రోజుల పసికందును ఓ కొతి ఎత్తుకెళ్లిన ఘటన ఒరిస్సాలో కలకలం రేపింది. చివరకు గ్రామస్తులు, అటవీ అధికారుల చొరవతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆ చిన్నారి తల్లితండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కటక్ జిల్లా, బంకిసమితి సమీపంలోని తాలబస్తాకు చెందిన దంపతులకు 16 రోజుల క్రితం బాబు పుట్టాడు. చిన్నారితో సహా ఆ తల్లి ఇంట్లో నిద్రిస్తుండగా అటుగా వచ్చిన వానరం చిన్నారిని తీసుకొని పరుగులు పెట్టింది.
దాన్ని అడ్డుకునేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. ఇదంతా చూసిన చిన్నారి తల్లి అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు, పోలీసులు పసివాడి కోసం మూడు బృందాలుగా గాలింపు చేపట్టారు. అందరూ సమీపంలోని అటవీప్రాంతంలో వెతక్కగా... ఓ ప్రాంతంలో చిన్నారిని గుర్తించారు. అయితే పిల్లవాడికి గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని... ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు చెబుతున్నారు. కోతుల నుంచి మాకు రక్షణ కల్పించాలని అధికారులకు మొరపెట్టుకున్న వారు స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. వారు అప్పుడే స్పందించి చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment