సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చౌహాన్ తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో.. నెటిజన్లు వ్యంగ్యంగా విమర్శలు చేస్తున్నారు. అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. పెట్టుబడులును ఆకర్షించే క్రమంలో అమెరికాలో పర్యటిస్తున్న వేళ.. అక్కడి రహదారులపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఇండియా-అమెరికా స్ట్రాటజిక్ ఫోరమ్‌లో సీఎం చౌహాన్ మాట్లాడుతూ.. అమెరికా రోడ్ల కంటే.. మధ్యప్రదేశ్ రహదారులే చాలా బాగుంటాయంటూ.. వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఆయన వాషింగ్టన్‌లో దిగిన అనంతరం..కార్లో ప్రయాణిస్తూ.. వాషింగ్టన్ రోడ్లకంటే.. మధ్యప్రదేశ్ రహదారులు చాలా అందంగా, సౌకర్యవంతంగా ఉంటాయనే షాకింగ్ కామెంట్లు చేశారు. సీఎం చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు.. సోషల్ మీడియాలో సెటైర్లు సంధిస్తున్నారు.
ఒకరైతే.. నెదర్లాండ్‌లోని అండర్ వాటర్ టన్నెల్ ఫొటోను ట్విటర్ పెట్టి.. ఇది గ్వాలియర్ అండర్ వాటర్ టన్నెల్.. అనుకుంటా.. అంటూ కామెంట్లు పోస్ట్ చేశారు. మరొకరైతే.. చైనాలోని షాంఘై నదిమీదున్న నాన్పు బ్రిడ్జిని పోస్ట్ చేస్తూ.. జబల్పూర్ అప్రోచ్ రోడ్ అంటూ కామెంట్లు చేశారు. మరికొందరైతే.. గత వర్షాకాలంలో రహదారులు మునిగిపోయిన సమయంలో సీఎం చౌహాన్‌నె పోలీసులు మోసుకెళుతున్న ఫొటో పెట్టి.. మధ్యప్రదేశ్ రహదారులు.. క్లీన్.. అండ్ స్మూత్‌కు సంకేతాలు అంటే కామెంట్లు చేశారు.
Underwater Tunnel for gwalior {M.P}
— james™ (जुमलेबाज) (@deniel_007) 24 October 2017
😸😸🌿#MPRoads pic.twitter.com/mgVXObCzRd
Approach road to airport at Jabalpur 😍😍 #MPRoads pic.twitter.com/rjf7dT3O1V
— manoj ☕️ (@ManojG7) 24 October 2017
Which is why he thought MP roads are better. pic.twitter.com/rl9oCS3bix
— Hasiba (@HasibaAmin) 24 October 2017
Comments
Please login to add a commentAdd a comment