రెండేళ్ల వయస్సులోనే యాసిడ్ దాడికి గురైన యువతి స్ఫూర్తిదాయక గాథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ముంబైకి చెందిన షబ్బూ రెండేళ్ల వయస్సులో ఉన్నప్పుడు.. ఆమె తల్లిపై తండ్రి యాసిడ్ దాడి చేశాడు. అతడు పోసిన యాసిడ్ సగం ఆమె మొఖంపై పడింది. అనంతరం అనాథగా ఆమె ఓ అనాథ ఆశ్రయంలో పెరిగింది. అక్కడ తరగని ప్రేమానురాగాల మధ్య తాను పెరిగానని పేర్కొన్న ఆమె సాహసోపేతమైన జీవితగాథను 'హ్యుమన్స్ ఆఫ్ బాంబ్వే' ఫేస్‌బుక్ పేజీ షేర్ చేసింది. యాసిడ్ దాడికి గురైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న ఆమె అసమాన ఆత్మస్థ్యైర్యం నెటిజన్లను కదిలిస్తోంది. ఆమె జీవితగాథను వేలమంది షేర్ చేసుకుంటున్నారు.
భయానకమైన యాసిడ్ దాడులు మనుష్యుల శరీరాలపై మచ్చలు మిగిల్చి.. కలల్ని ఛిద్రం చేస్తాయి. కానీ, గతంలో ఎప్పుడో జరిగిన యాసిడ్ దాడి తన ప్రస్తుత జీవితాన్ని అడ్డంకిగా మారకూడదని షబ్బూ నిర్ణయించుకొంది. కాలేజీలో చదివేటప్పుడు కొత్తవారితో స్నేహం చేసేందుకు మొదట తను జంకేది. కానీ, అదంతా మన మనస్సులోని భావనే అని గుర్తించిన షబ్బూ.. తన కలలు నిజం చేసుకొనే దిశగా ధైర్యంగా సాగుతోంది. 'గతంలో జరిగిన ఘటనకు సంబంధించి నన్ను ఇప్పటికీ యాసిడ్ దాడి బాధితురాలిగా ప్రజలు పిలుస్తారు. అది నాకు నచ్చదు. నేను బాధితురాల్ని కాదు. నా ముఖంపై ఉన్న మచ్చలను స్వీకరించి.. జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నా' అని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు నెటిజన్లలో స్ఫూర్తి రగిలిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment