గుర్గావ్లో కాల్పుల కలకలం! | Murder at Gurgaon Petrol Pump | Sakshi
Sakshi News home page

గుర్గావ్లో కాల్పుల కలకలం!

Published Wed, Nov 11 2015 5:49 PM | Last Updated on Tue, Oct 2 2018 2:30 PM

గుర్గావ్లో కాల్పుల కలకలం! - Sakshi

గుర్గావ్లో కాల్పుల కలకలం!

గుర్గావ్: గుర్గావ్లో దారుణం జరిగింది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్గావ్లోని సెక్టార్-5 సమీపంలోని ఓ పెట్రోల్ బంక్లో మంగళవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

రెండు బైక్లపై నలుగురు దుండగులు పెట్రోల్బంక్లోకి ప్రవేశించారు. ఓ బైక్పై వెనుక కూర్చున్న వ్యక్తి మొదట కాల్పులు ప్రారంభించగా, రెండో బైక్పై వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు అప్పటికే వారి దగ్గరున్న రివాల్వర్తో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని వెంబడించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో రియల్టర్ అక్కడిక్కడే కుప్పకూలి మరణించాడు.

కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమీపంలో ఉన్న వ్యక్తుల వద్ద కూడా రైఫిల్స్ ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సంఘటన జరిగిన తీరును బట్టి ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు రియల్టర్ రాజు(32)గా పోలీసులు గుర్తించారు.  రియల్టర్ వ్యాపార గొడవలే ఈ హత్యకు దారి తీసినట్లు ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement