‘ముస్లిం పెళ్లి చట్టాల’పై నివేదిక ఇవ్వండి: సుప్రీం | 'Muslim marriage laws on "Give Report: Supreme Court | Sakshi
Sakshi News home page

‘ముస్లిం పెళ్లి చట్టాల’పై నివేదిక ఇవ్వండి: సుప్రీం

Published Tue, Mar 29 2016 4:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

'Muslim marriage laws on "Give Report: Supreme Court

న్యూఢిల్లీ: ముస్లిం వైవాహిక చట్టాలపై అధ్యయనానికి నియమించిన కమిటీ రూపొందించిన నివేదికను 6 వారాల్లోగా తమ ముందుంచాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం అనుసరిస్తున్న బహుభార్యత్వం, తలాక్ విధానాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ థాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తూ.. కమిటీ నివేదికను తమ ముందుంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement