కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!? | Mysore Wonder Boy Prediction About Pandemic Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?

Published Fri, Apr 3 2020 12:52 PM | Last Updated on Fri, Apr 3 2020 1:33 PM

Mysore Wonder Boy Prediction About Pandemic Coronavirus - Sakshi

కరోనా మహహ్మారి గురించి ఏడు నెలల క్రితమే ఓ బాల మేధావి అలర్ట్‌ చేశాడా? ఇప్పుడు అతను చెప్పినట్లే జరుగుతోందా? మార్చి 29 నుంచి చాలా క్లిష్టపరిస్థితులు అని బాల సన్యాసి చెప్పినట్లే.. ఆ రోజు నుంచి కేసులు పెరుగుతూ వచ్చాయా? మరిప్పుడు అతను చెప్పినట్లే ఏప్రిల్‌ మొదటి వారం మరింత కీలకం కానుందా? అసలు ఆ బాల సన్యాసి ఏం చెప్పాడు? ఏం జరగబోతోంది?

బెంగుళూరు: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు కకావికలం అవుతున్నాయి. కోవిడ్‌-19 ను నిరోధించే మందు లేకపోవడంతో.. వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఈ దిశగా కొన్ని దేశాలు ముందుగానే మేల్కొంటే.. మరికొన్ని దేశాలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నాయి. కనిపించని శత్రువుతో ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తుండగా.. వైరస్‌ వ్యాప్తిపై రకరకాల కథనాలైతే ప్రచారంలోకి వస్తున్నాయి. కోరంకి జబ్బు పుట్టుకొచ్చి లక్షలాది మందిని కబళిస్తుందని పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఎప్పుడో చెప్పారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
(చదవండి: కరోనా: చూయింగ్‌ గమ్‌, గుట్కా, పాన్‌లపై నిషేధం)

ఈశాన్యంబున విషగాలి పుట్టేను
లక్షలాది ప్రజలు సచ్చేరయ
కోరంకి అను జబ్బు కోటిమందికి తగిలి
కోడిలాగ తూగి సచ్చేరయ

అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారని.. ఇప్పుడదే జరుగుతోందని విస్తృతంగా ప్రచారం సాగింది. తాజాగా మరో ప్రచారం జోరందుకుంది. 2020లో కరోనా వైరస్‌ వస్తుందని ముందుగానే ఓ బాలమేధావి చెప్పినట్లు సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఆనాడు బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతున్నట్టే... నేడు మైసూరుకు చెందిన బాల మేధావి అభిజ్ఞా ఆనంద్‌ చెప్పిందే జరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ అనే పేరు చెప్పకపోయినా మిగతా అన్ని విషయాలు ఆ బాల మేధావి చెప్పినట్టుగానే జరుగుతుండడంతో అభిజ్ఞ ప్రిడిక్షన్‌ మీద ఇప్పుడు జనాల్లో నమ్మకం బాగా పెరిగిపోయింది. ఇంతకూ అతను ఏం చెప్పాడో.. ఈ వీడియో చూసి తెలుసుకోండి!!
(చదవండి: సోషల్ మీడియా, ఫేక్ వీడియోల మాయలో పడకండి!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement