మొతెరా స్టేడియంలో ట్రంప్, మెలానియాలతో ప్రధాని మోదీ
అహ్మదాబాద్: మొతెరా మైదానంలో సోమవారం నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగంతో భారతీయుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. 27 నిమిషాల పాటు ప్రసంగించిన అగ్రరాజ్యధినేత ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. టఫ్ నెగోషియేటర్ (గట్టి ప్రతినిధి) అంటూ మోదీకి ట్రంప్ కితాబిచ్చారు. దాదాపు 2800 పదాల్లో ఆయన ప్రసంగాన్ని రాసుకున్నారు. పలు పదాలను ఆయన పదే పదే ఉటంకించారు.
ఇండియా, ఇండియాస్, ఇండియన్, ఇండియన్స్ పదాలను 60 సార్లు ఉచ్చరించారు. మిలటరీ, టెర్రరిజం, డిఫెన్స్, ఆర్మడ్, ఐఎస్‌ఐఎస్ పదాలు 20 సార్లు వచ్చాయి. మోదీ, ప్రైమ్ మినిస్టర్ పదాలను 17 సార్లు పలికారు. అలాగే ప్రధాని మోదీ తన ప్రసంగంలో ట్రంప్ పేరును 22 పర్యాయాలు ఉచ్చరించారు. లవ్, లవ్స్, హర్మోనీ, ఫ్రెండ్‌షిప్, పీస్, యూనిటీ పదాలు 14 సార్లు ట్రంప్ నోటి నుంచి వచ్చాయి. పాకిస్తాన్, పాకిస్తాని పదాలకు కేవలం నాలుగుసార్లు మాత్రమే ట్రంప్ ప్రసంగంలో చోటు దక్కింది. (చదవండి: హోలీ టు షోలే.. లవ్యూ ఇండియా)
Comments
Please login to add a commentAdd a comment