కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా నందన్ నీలేకని?
‘ప్రధాని అభ్యర్థిని అనువైన సమయంలో ప్రకటిస్తాం’... నాలుగు రాష్ట్రాల్లో చేదు ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మీడియాకు చెప్పిన మాటలివి. నిజానికి ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్‌లో ఇప్పటి వరకు లేనే లేదు. కానీ, మేడం మాటలతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మాత్రం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఇన్ఫోసిస్ నిర్మాణకర్తల్లో ఒకరైన నందన్ నీలేకని అంటూ ప్రచారం సాగుతోంది. అయితే నీలేకని ఈ వార్తలను చెత్త అంటూ కొట్టిపడేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కథనాన్ని కల్పితమైనదిగా అభివర్ణించింది. రాహుల్ గాంధీ లేదా వేరొక నేతను ప్రధాని అభ్యర్థిగా అదిష్టానమే నిర్ణయిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు.