మీరు రండి.. మా కూడంకుళం చూడండి
భారతదేశానికి రష్యాతో ఉన్న సంబంధం ఈనాటిది కాదు. ఎప్పటినుంచో ఈ రెండు దేశాల మధ్య మైత్రీ సంబంధాలు పటిష్ఠంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. అణు, రక్షణ, ఇంధన రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలనుకుంటున్నట్లు ఆయనకు తెలిపారు. ఒకసారి వచ్చి కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు చూడాల్సిందిగా పిలిచారు.
బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో దాదాపు 40 నిమిషాల పాటు ఈ దేశాధినేతలిద్దరూ చర్చించుకున్నారు. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన విజయానికి మోడీని పుతిన్ అభినందించారు. 2001లో కూడా ఒకసారి మోడీ-పుతిన్ల భేటీ మాస్కోలో జరిగింది. భారతదేశంలో చిన్న పిల్లాడినైనా సరే మన దేశానికి మంచి మిత్రుడు ఎవరని అడిగితే రష్యా అని చెబుతాడని ఈ సందర్భంగా మోడీ అన్నారు.