రేపు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ | Narendra Modi to visit Patna tomorrow | Sakshi
Sakshi News home page

రేపు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ

Published Fri, Nov 1 2013 12:52 PM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

రేపు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ - Sakshi

రేపు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ

బీహార్ రాజధాని పాట్నావరుస బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ శనివారం వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలసి వారి పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇటీవల పాట్నాలో మోడీ పాల్గొన్న ర్యాలీ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా మోడీ భద్రత కోసం శుక్రవారం పాట్నాకు వెళ్తున్న ఇద్దరు భద్రత అధికారులు ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిర్సాగంజ్ ప్రాంతంలోని మల్కన్పూర్ రోడ్డు పక్కన ఆపిన గుజరాత్ పోలీస్ శాఖ బాంబు నిర్వీర్య దళ వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భద్రత అధికారులు భాయ్లాల్ (30), జైరామ్ (30) మరణించారు. గాయపడిన ధీరు భాయ్, మోహన్ సింగ్, వీరేంద్ర, గిరి, మఘను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement