patna visit
-
బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి: సీఎం కేసీఆర్
సాక్షి, పాట్నా: అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళ్లలో మోదీ సర్కార్ దేశానికి చేసిందేం లేదని, పైగా వినాశకర పరిస్థితి తీసుకొచ్చిందని ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. బుధవారం పాట్నాలో బీహార్ సీఎం నితీశ్ కమార్తో భేటీ అనంతరం కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో పరిస్థితులు ఘోరంగా పడిపోతున్నాయ్. కనీసం ఒక్క రంగాన్ని కూడా మోదీ ప్రభుత్వం బాగు చేయలేదు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. ఏ ప్రధాని హయాంలో రూపాయి విలువ పడిపోలేదు. దేశరాజధాని ఢిల్లీలో నీళ్లకు, కరెంట్ కొరత నడుస్తోంది. దేశంలో ధరలు, అప్పులు పెరిగిపోయాయి. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైంది. సామాన్యులు, రైతులు.. అన్నీ వర్గాల వాళ్లు ఆందోళనలో ఉన్నారు. మోదీ సర్కార్ అసమర్థ నిర్ణయాలతో దేశంలో తిరోగమనంలో ఉంది. జాతీయ జెండా సహా అన్నీ.. చివరకు నెయిల్కట్టర్ కూడా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయ్. మోదీ మేకిన్ ఇండియా ఎటు పోయింది? చైనాతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నాం?. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలను తుడిచిపెడతామని బీజేపీ అంటోంది. అందుకే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి. బీజేపీ ముక్త్ భారత్ సాధించాలి. నితీశ్ కూడా ఇదే కోరుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను కేంద్రంలోని బీజేపీ ఇబ్బంది పెడుతోంది. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు అన్నీ అమ్మేస్తోంది కేంద్రం. అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుంది. ‘బేచో ఇండియా’ అనేదే బీజేపీ నినాదం. బీజేపీలో అంతా సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తెస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో మోదీ వేలు పెట్టాల్సిన అవసరం ఏముంది? ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ అనే నినాదం ఎందుకు చేశారు? అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక తాటిపైనే ఉన్నాం. బీజేపీ వ్యతిరేక కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై తొందర లేదు. విస్తృతంగా చర్చించాకే నాయకత్వం నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలపై సంచలన విమర్శలు చేసిన సీఎం కేసీఆర్.. సీబీఐ లాంటి ఏజెన్సీలకు రాష్ట్రాల్లో ఏం పని అని.. శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశాలని అన్నారు. ఇదీ చదవండి: మునుగోడు ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు -
రేపు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ
బీహార్ రాజధాని పాట్నావరుస బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ శనివారం వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలసి వారి పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇటీవల పాట్నాలో మోడీ పాల్గొన్న ర్యాలీ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా మోడీ భద్రత కోసం శుక్రవారం పాట్నాకు వెళ్తున్న ఇద్దరు భద్రత అధికారులు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సిర్సాగంజ్ ప్రాంతంలోని మల్కన్పూర్ రోడ్డు పక్కన ఆపిన గుజరాత్ పోలీస్ శాఖ బాంబు నిర్వీర్య దళ వాహనాన్ని వేగంగా వస్తున్న ఓ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భద్రత అధికారులు భాయ్లాల్ (30), జైరామ్ (30) మరణించారు. గాయపడిన ధీరు భాయ్, మోహన్ సింగ్, వీరేంద్ర, గిరి, మఘను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
బీహార్ 'ప్రభుత్వ అతిథి' హోదాలోమోడీ పర్యటన
పాట్నా: గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాస్తా బీహార్ ప్రభుత్వ అతిథిగా మారనున్నారు. పాట్నా బాంబు దాడి ఘటనలో మరణించిన కుటుంబాల్ని పరామర్శించేందుకు ఆయన బీహార్ రాష్ట్రానికి అతిథి హోదాలో వెళ్లనున్నారు. రేపట్నుంచి మోడీ తలపెట్టనున్న పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాష్ట్ర అతిథి హోదాలో ప్రోటాకాల్ ఉంటుందని కేబినెట్ సమన్యయ కమిటీ ముఖ్య కార్యదర్శి బ్రజేష్ మహరోత్రా తెలిపారు. కాగా, సీఎం హోదాలో ఉన్న మోడీ రాష్ట్ర అతిథి హోదాను కల్పించడంపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించారు. అతను ఆ హోదాకు పూర్తిగా అర్హుడని ఆ పార్టీ నేత సుశీల్ కుమార్ మోడీ అభిప్రాయపడ్డారు. గత ఆదివారం పాట్నాలో మోడీ ర్యాలీకు కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధిత కుటుంబాల్ని పరామర్శించేందుకు మోడీ శుక్రవారం పాట్నాకు చేరుకోనున్నారు. మరణించిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారు కావడంతో మోడీ వారి స్వస్థలాకు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించనున్నారు. ఆ ఘటనలో మొత్తం ఏడు పేలుళ్లు జరగగా, గాంధీ మైదాన్ సమీపంలోనే ఆరు పేలుళ్లు సంభవించాయి.