పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని...
ముంబై/నాసిక్: శాస్త్రసాంకేతిక పరంగా ఎంతగా పురోగమించినా ఆధునిక సమాజంలో అనాగరిక పోకడలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. తాను పెళ్లాడిన యువతి కన్య కాదని 48 గంటల్లోనే వివాహ బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడో పురుషహంకారి. అతగాడికి కులపెద్దలు మద్దతు పలకం గమనార్హం. కన్యత్వ పరీక్షకు వరుడిని ప్రోత్సహించడం కులపెద్దలే పోత్సహిచడం మరింత విడ్డూరం.
మే 22న పెళ్లిచేసుకున్న వరుడికి కులపెద్దలు తెల్లని దుప్పటి ఇచ్చారు. రెండు రోజుల రోజుల తర్వాత ఈ దుప్పటిని పెళ్లికొడుకు కులపెద్దలకు తిరిగిచ్చేసాడు. దుప్పటిపై రక్తపు మరకలు లేకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని అన్నాడు. దీంతో ఆమెతో వివాహ బంధం తెంచుకునేందుకు అతడికి కులపెద్దలు అనుమతిచ్చారు.
బాధితురాలు పోలీసు పరీక్షలకు సిద్ధమవుతూ రన్నింగ్, లాంగ్ జంపింగ్, సైక్లింగ్ ఇతర కసరత్తులు చేస్తోందని సామాజిక కార్యకర్తలు రంజనా గవాండే, కృష్ణా చందగుడే వెల్లడించారు. ఈ విషయం కులపెద్దలకు వివరిస్తామని, సామరస్య పరిష్కారం లభించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.