virginity test
-
'శీల' పరీక్షలో నవ వధువు ఫెయిల్.. పెద్దల షాకింగ్ తీర్పు
ముంబై : వర్జినిటీ(కన్యత్వ) పరీక్షలో విఫలమయ్యిందని నవ వధువులిద్దరిని పుట్టింటికి పంపించిన అమానవీయఘటన మహారాష్ష్ర్టలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అదే గ్రామానికి చెందిన అన్నాతమ్ముళ్లతో నవంబర్ 27న పెళ్లి జరిపించారు. అయితే తొలిరాత్రి తర్వాత వధువు శీలవతా? కాదా అని తెలుసుకోవడానికి ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కన్యత్వ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఒకరు మాత్రమే ఉత్తీర్ణులు కాగా, మరొక వధువుకి ఎలాంటి రక్తస్రావం కాలేదు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను పుట్టింటికి పంపించేశారు. ఈ పెళ్లిని తక్షణమే రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, 10 లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై అమ్మాయి తల్లిదండ్రులు జాత్ పంచాయతీ వారిని సంప్రదించగా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. కులంలోని కట్టబాట్ల ప్రకారం వర్జినిటీ పరీక్షలో యువతి విఫలమయిందని, దీంతో ఆమెకు ఇదివరకే ఎవరితోనో సంబంధం ఉందని పంచాయతీ పెద్దలు ఆరోపించారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేస్తున్నామని తీర్పుచెప్పారు. కాగా మహారాష్ట్రలో ఎక్కువగా కనిపించే కంజర్భట్ వర్గంలో ఇలాంటివి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఈ వర్గంలోని ప్రతి మహిళ పెళ్లైన రోజున ఈ పరీక్ష ఎదుర్కోవాల్సిందే. అది కూడా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలోనే జరగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : బలవంతంగా ఫోటోలు.. ఆపై వాట్సాప్.. కట్‌చేస్తే! ప్రేమ వ్యవహారం: కొద్ది రోజుల్లో పెళ్లి.. యువతి తల నరికి -
స్త్రీలోక సంచారం
ఇంత మంచి గుడ్ వరల్డ్‌లో ఉన్నాం కదా.. ‘కన్యత్వ పరీక్ష’ అనే బ్యాడ్ వర్డ్ ఇంకా వినిపిస్తూనే ఉంది! ఒక ఆడపిల్ల కన్యా, కాదా? అని తెలుసుకోడానికి చేసే అనాగరికమైన పరీక్ష ఇది. ఇందులోనే ఇంకా అనాగరికం.. కొందరు డాక్టర్లు చేసే ‘టూ–ఫింగర్ టెస్ట్’. సాధారణంగా.. ఒక యువతి, లేదా బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజముందా లేదా నిర్థారించడానికి చేసే పరీక్షల్లో టూ–ఫింగర్ టెస్ట్ ఒకటి. బాధితురాలి జననావయవంలోకి రెండు వేళ్లు చొప్పించి, ఆ వేళ్లు సులువుగా లోపలికి ప్రవేశించగలిగితే ఆమె కన్య కాదనీ, వేళ్ల ప్రవేశం కష్టం అయితే ఆమె కన్య అని ఒక కంక్లూజన్‌కి వస్తారు! ఈ టెస్ట్‌లోనే వేళ్లకు కన్నెపొర (జననావయవ అంతర్ ముఖద్వారంలో ఉండే పొర) అడ్డుపడితే ఆమె కన్య అయినట్లు, పొర అడ్డుపడకపోతే ఆమె కన్య కానట్లు భావిస్తారు. ఇదొక అర్థం లేని పరీక్ష అని నికార్సైన వైద్య నిపుణులు ఏనాడో తేల్చి పారేసినప్పటికీ.. ఇప్పటికీ చాలాచోట్ల అత్యాచారం కేసులలో అధికారికంగా, నూతన వరుడు సందేహపడిన సందర్భంలో అనధికారికంగా ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ చేస్తున్నారు. కన్నెపొర లేకపోవడానికి, జననాంగ గోడలు వదులుగా ఉండడానికి కన్యత్వాన్ని కోల్పోవడమే కారణమవక్కర్లేదు. పొర, వదులు అన్నవి ఆటల్లో పోవచ్చు. ఇప్పుడీ బ్యాడ్ టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ఓ గుడ్ డాక్టర్ ఈ ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వైద్య పాఠ్యాంశాలలోనే లేకుండా తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఆ డాక్టరు గారి పేరు ఇంద్రజిత్ ఖండేకర్. మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఉన్న ‘మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ లో ఫోరెన్సిక్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయినా ‘టూ–ఫింగర్ టెస్ట్’ అనే ఈ పరీక్ష.. వైద్యపుస్తకాల్లో ఎందుకు ఉన్నట్లు? మొదట ఎవరో చేర్చారు. తర్వాత ఎవరూ మార్చలేదు. డాక్టర్ ఖండేకర్ ఆరోగ్య శాఖకు మాత్రమే రాయలేదు. భార త వైద్య మండలికి, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, మహారాష్ట్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కూ.. ఈ టూ–ఫింగర్ టెస్ట్ ప్రస్తావనను పుస్తకాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తులు పంపారు. ‘ఇదొక బుద్ధిలేని, అసంబద్ధమైన పరీక్ష’ అని ఆయన ‘టూ–ఫింగర్ టెస్ట్’ను వర్ణించారు. ఆడపిల్లను ఫిజికల్‌గా బాధ పెట్టి, అవమానించే ఈ పరీక్ష మహిళపై జరిగే హింస కంటే కూడా ఎక్కువే అని అంటారు ఖండేకర్. 2018 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ‘యు.ఎన్. ఉమెన్’ కూడా ఇదే మాట చెప్పింది. అయితే మొత్తం అన్ని రకాలైన కన్యత్వ పరీక్షల గురించి చెప్పింది. ఇలాంటి పరీక్షలకు ముగింపు పలకాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. ‘ది క్వింట్’ భారతదేశంలో పేరున్న న్యూస్ వెబ్సైట్. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తోంది. క్వింట్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ‘మి, ది ఛేంజ్’ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్న 18–23 ఏళ్ల మధ్య వయసు గల యువతులలోంచి ‘ఉమన్ అచీవర్’ని ఎంపిక చేయడం కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. సైట్లోకి వెళ్లి, నామినేషన్ ఫారమ్‌లో మీకు తెలిసిన యంగ్ ఉమెన్ అచీవర్ వివరాలను పొందుపరిస్తే చాలు. మీరు నామినేట్ చేస్తున్నప్పుడు మీ పేరును వెల్లడించడం తప్పనిసరేం కాదు. మీ ఇ–మెయిల్, మీ కాంటాక్ట్, మీరు సూచిస్తున్న యువతి పేరు, ఆమె వయసు, ఆమె సాధించిన విజయం, ఆమె వివరాలు ఇస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్, మీ సోదరి.. వారెవరైనా సరే మీరు నామినేట్ చెయ్యొచ్చు. ‘మి, ది ఛేంజ్’ కాంపెయిన్‌కి ప్రముఖ మలయాళీ నటి పార్వతి తన సహకారం అందిస్తున్నారు. -
కన్యత్వ పరీక్షలు.. వాట్సాప్ గ్రూప్‌పై మండిపాటు
పుణె: దేశంలో దురాచారాలకు కొదవే లేదు. పెళ్లైన నవ వధువుకి కన్యత్వ పరీక్షలు చేస్తున్న అనాగరిక ఆచారం ఓవైపు .. తమ తెగలోని మహిళలకు ఎదురయ్యే పరిస్థితులను సోషల్ మీడియా వేదికగా బయటపెడుతున్న ప్రబుద్ధులు మరోవైపు. వెరసి కంజర్భట్ దురాచార బాధితుల సమాచారం వాట్సాప్‌లో వైరల్ అవటం చర్చనీయాంశంగా మారింది. విషయం ఏంటంటే.. కంజర్భట్ తెగలో తొలి రాత్రి మహిళలకు కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆచారానికి వ్యతిరేకంగా ‘స్టాప్ ద వీ-రిచువల్’ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ బాధితుల ఫోటోలను, సమాచారాన్ని వైరల్ చేస్తోంది. అయితే ఆ వాట్సాప్ గ్రూప్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని.. తమ జాతిని అవహేళన చేస్తోందని సదరు తెగ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ‘సత్వ పరీక్ష’ల ఆచారం వల్ల ఏ మహిళ కూడా బాధితురాలిగా మిగల్లేదని.. తమ జాతిపై తప్పుడు ప్రచారం చేసిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ క్షమాపణలు చెప్పాలని కమ్యూనిటీ సభ్యురాలు భావనా మనేకర్ డిమాండ్ చేశారు. అత్తింటివారి,పుట్టింటి వారి మద్దతుతోనే ఈ పరీక్షలు జరగుతాయనీ.. వీటిలో ఎవరి జోక్యం అవసరం లేదనీ అదే తెగలోని మరో వర్గం మండిపడుతోంది. వాస్తవాలను మరుగున పరిచి ఆర్థికంగా లాభం పొందడానికి కొందరు కావాలనే దుష్ర్పచారాలు చేస్తున్నారని వారంటున్నారు. కాగా ఈ వాట్సాప్ గ్రూప్‌పై చర్యలు తీసుకోవాలని తెగ నాయకులు కొందరు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కు ఫిర్యాదు చేశారు కూడా. -
పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని...
ముంబై/నాసిక్: శాస్త్రసాంకేతిక పరంగా ఎంతగా పురోగమించినా ఆధునిక సమాజంలో అనాగరిక పోకడలు అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో తాజాగా బయటపడిన ఉదంతం నవనాగరికుల గుడ్డి నమ్మకాలకు అద్దం పడుతోంది. తాను పెళ్లాడిన యువతి కన్య కాదని 48 గంటల్లోనే వివాహ బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడో పురుషహంకారి. అతగాడికి కులపెద్దలు మద్దతు పలకం గమనార్హం. కన్యత్వ పరీక్షకు వరుడిని ప్రోత్సహించడం కులపెద్దలే పోత్సహిచడం మరింత విడ్డూరం. మే 22న పెళ్లిచేసుకున్న వరుడికి కులపెద్దలు తెల్లని దుప్పటి ఇచ్చారు. రెండు రోజుల రోజుల తర్వాత ఈ దుప్పటిని పెళ్లికొడుకు కులపెద్దలకు తిరిగిచ్చేసాడు. దుప్పటిపై రక్తపు మరకలు లేకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న యువతి కన్య కాదని అన్నాడు. దీంతో ఆమెతో వివాహ బంధం తెంచుకునేందుకు అతడికి కులపెద్దలు అనుమతిచ్చారు. బాధితురాలు పోలీసు పరీక్షలకు సిద్ధమవుతూ రన్నింగ్, లాంగ్ జంపింగ్, సైక్లింగ్ ఇతర కసరత్తులు చేస్తోందని సామాజిక కార్యకర్తలు రంజనా గవాండే, కృష్ణా చందగుడే వెల్లడించారు. ఈ విషయం కులపెద్దలకు వివరిస్తామని, సామరస్య పరిష్కారం లభించకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.