స్థూలకాయానికి సహజసిద్ధ ఔషధం
కొచ్చి: స్థూలకాయం, డిస్లీపిడీమియా (రక్తంలో లిపిడ్ల సంఖ్య పెరగడం) వ్యాధులకు శాస్త్రవేత్తలు సముద్ర కలుపు మొక్కల నుంచి సహజ సిద్ధ విరుగుడును కనుగొన్నారు. కాడల్మిన్ టీఎంఏసీఈ (కాడల్మిన్ టీఎం యాంటీపర్కొలెస్టరొలేమిక్ ఎక్స్‌ట్రాక్ట్)గా పిలిచే ఇది వంద శాతం సహజసిద్ధ సముద్ర బయోయాక్టివ్ పదార్థాల నుంచి తయారైన ఏకైక ఔషధమని కొచ్చిలోని కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ వెల్లడించింది.
సంస్థ ఏర్పడి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఈ ఔషధాన్ని విడుదల చేస్తారు. భారత సముద్ర తీరాల్లో విరివిగా లభించే, ఔషధ గుణాలున్న కలుపు మొక్కల నుంచి దీన్ని తయారుచేశారు. దీన్ని 400 ఎంజీ మాత్రల్లో తెస్తామని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పరీక్షల్లో తేలిందని శాస్త్రవ్తేలు చెప్పారు.