పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చారిత్రక జమా మసీదులో ప్రార్థనలు చేసి, ఎర్రకోటను సందర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన.. మంగళవారం నాడు ఢిల్లీలో పర్యటించారు. ఆయనతో పాటు పలువురు పాక్ అధికారులు కూడా ఉన్నారు.
నరేంద్రమోడీతో నవాజ్ షరీఫ్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సహకారం, ఇతర అంశాలపై వీరిద్దరు చర్చించుకునే అవకాశం ఉంది. వాజ్పేయి హయాంలో మొదలైన ప్రక్రియను ఇప్పుడు మళ్లీ కొనసాగించాలని భావిస్తున్నట్లు షరీఫ్ చెప్పారు. మోడీని కూడా పాకిస్థాన్కు ఆయన ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా ఏమాత్రం బాగోని సంబంధాలు ఇప్పుడు కాస్త మెరుగుపడొచ్చని అంటున్నారు.
జమా మసీదులో నవాజ్ షరీఫ్ ప్రార్థనలు
Published Tue, May 27 2014 10:21 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement
Advertisement