పార్టీలకు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ‘హరిత ప్రణాళిక’కు చోటు కల్పిం చాలని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ విజ్ఞప్తి చేసింది. అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుం దని ఆందోళన వ్యక్తం చేసింది. కౌన్సిల్ ఫర్ గ్రీ న్ రివల్యూషన్ సభ్యులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంసీ మెహతా, ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ సమాచార కమిషనర్ ఆర్.దిలీప్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పర్యావరణాన్ని కాపాడటాన్ని నాయకు లు తమ అజెండాగా పెట్టుకోవాలని, లేదంటే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం కూడా ఉండదని మెహతా అన్నారు. పర్యావరణం పరిరక్షణపై ఈ కౌన్సిల్ పోరాడుతోందని దిలీప్‌రెడ్డి చెప్పారు.
హరిత మేనిఫెస్టో కావాలి
Published Sat, Mar 15 2014 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement