న్యూఢిల్లీ: భారత సంతతి వ్యక్తి, ప్రవాస భారతీయ పౌరసత్వ పథకాలను కలిపి కొత్త పౌరసత్వ బిల్లును హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకుగానూ పౌరసత్వ సవరణ బిల్లు-2014ను ప్రభుత్వం గురువారం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా, బలవంతపు మతమార్పిడిని నిషేధంచాలని కోరుతూ శివసేనకి చెందిన సదాశివ లోఖండే శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు.
స్వచ్ఛందంగా మతం మారినవారికి, పూర్వమతంలోకి తిరిగి వ చ్చేవారికి చట్టం వర్తించదని ఈ బిల్లు చెబుతోంది. బలవంతపు మత మార్పిడిని ప్రోత్సహించేవారికి పదేళ్లవరకూ జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. మత మార్పిడిని ప్రోత్సహించే సంస్థలు, వాటి అధినేతలను శిక్షించాలని కోరుతోంది.
లోక్‌సభ ముందుకు కొత్త పౌరసత్వ బిల్లు
Published Sat, Feb 28 2015 4:34 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement
Advertisement