న్యూఇయర్‌ వేడుకల్లో రెచ్చిపోయిన కీచకులు | New Year’s eve in Bengaluru witnesses mass molestation of women in police presence | Sakshi
Sakshi News home page

న్యూఇయర్‌ వేడుకల్లో రెచ్చిపోయిన కీచకులు

Published Mon, Jan 2 2017 1:04 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

న్యూఇయర్‌ వేడుకల్లో రెచ్చిపోయిన కీచకులు - Sakshi

న్యూఇయర్‌ వేడుకల్లో రెచ్చిపోయిన కీచకులు

బెంగళూరు: కొత్త సంవత్సర వేడుకల్లో కీచకులు రెచ్చిపోయారు. భారత సిలికాన్‌ వ్యాలీ బెంగళూరులో బహిరంగంగానే బరితెగించారు. న్యూఇయర్‌ స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్న మహిళలను వేధింపులకు గురిచేశారు. పోలీసుల సాక్షిగానే కీచకులు ఈ అఘాయిత్యాలకు పాల్పడడం భయాందోళన రేపుతోంది. బాధితులు ఫిర్యాదు చేసినా రక్షకభటులు చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయని ‘బెంగళూరు మిర్రర్‌’ పత్రిక తెలిపింది.

నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి ఎప్పటిలాగానే పెద్ద ఎత్తున జనం ఎంజీ రోడ్డు, బ్రిగేడ్‌ రోడ్లపైకి వచ్చారు. జనమంతా సంబరాల్లో మునిగితేలుతున్న సమయంలో కామాంధులు తమ బుద్ధి ప్రదర్శించారు. మహిళలు, యువతలను అభ్యంతరకరంగా తాకడం.. ఉద్దేశ్వపూర్వకంగా వారిపై పడడం, వక్రచూపులతో వేధించడం.. మొదలుపెట్టారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. ముందుజాగ్రత్తగా పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదని బాధితులు వాపోయారు. ‘లైట్‌ తీస్కోండి’ అంటూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపైనా పోలీసులు చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement