సాక్షి, న్యూఢిల్లీ : హోలీ సందర్భంగా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీకా దహన్ కార్యక్రమాన్ని చేపట్టడం సంప్రదాయం. బ్యాంకులకు రూ వేలాది కోట్ల ఎగవేత కేసులో నిందితుడు నీరవ్ మోదీ దిష్టిబొమ్మను హోలీ సందర్భంగా దహనం చేసేందుకు ముంబయిలోని వొర్లిలో స్ధానికులు సంసిద్ధమయ్యారు. 58 అడుగుల ఎత్తున్న దిష్టిబొమ్మలో భారీ డైమండ్‌పై బ్రౌన్ సూట్‌తో నీరవ్ మోదీ కూర్చున్నట్టుగా తీర్చిదిద్దారు. దీనిపై పీఎన్‌బీ స్కామ్, డైమండ్ కింగ్ అనే క్యాప్షన్ ఇచ్చారు.
రూ 12,000 కోట్ల పైబడిన పీఎన్‌బీ స్కామ్‌లో సూత్రధారులైన నీరవ్ మోదీ, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీలపై దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ, ఈడీ రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశాయి. వీరిపై కేసులు నమోదు కాకముందే నీరవ్, చోక్సీలు దేశం విడిచివెళ్లినట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment