ఎంసీఐను రద్దు చేయాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది.
న్యూఢిల్లీ: వైద్య విద్య నియంత్రణ సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ను రద్దు చేయాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది. దాని స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) ఏర్పాటు చేయాలని సూచించింది.
లోపభూయిష్ట ఎంసీఐ పనితీరును కమిటీ అధ్యయనం చేసింది. యూజీసీ, ఏఐసీటీఈల పునర్వ్యవస్థీకరణకు కూడా రోడ్ మ్యాపు సిద్ధం చేయాలని కేంద్రం నీతి ఆయోగ్‌ను ఆదేశించింది.