ప్రతీకాత్మక చిత్రం
చెన్నై: బ్యాంకులకు వరుస సెలవలు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అధికారులు స్పందించారు. అదంతా అసత్య ప్రచారమని, ఇందులో వాస్తవం లేదని తోసిపుచ్చారు. బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు అనేది తప్పుడు సమాచారమని బ్యాంకు యూనియన్ నాయకుడొకరు చెప్పారు. బ్యాంకులకు మార్చి 31 రోజున పనిదినమని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్పడరేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ థామస్ ప్రాంకో రాజేంద్రదేవ్ తెలిపారు.
మహవీర్ జయంతి, గుడ్ ప్రైడేలు గురు, శుక్రవారాల్లో వస్తుండటంతో ఆ రెండు రోజులు బ్యాంకులకు సెలవు ప్రకటించారని తెలిపారు. మార్చి 31వ తారీఖు నెలలో ఐదో శనివారం కావడంతో బ్యాంకులు తెరిచే ఉంటాయని, కేవలం రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవని చెప్పారు. ఏప్రిల్ 2న వార్షిక ముగింపు ఖాతాల కోసం బ్యాంకులను మూసివేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment