వారు నాలుగేళ్లు గర్భానికి దూరంగా ఉండాలట
న్యూఢిల్లీ: భారత వాయుసేనలోని ఫైటర్ జెట్ విమానాల పైలెట్లుగా అడుగుపెడుతున్న మహిళలు కనీసం నాలుగు సంవత్సరాలపాటు గర్భందాల్చకుండా జాగ్రత్తపడాలని సూచించారు.
భారత వాయుసేన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోహా ఓ పత్రికతో మాట్లాడుతూ శిక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం హైదరాబాద్లోని శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న తొలి మహిళా జెట్ పైలెట్లకు నాలుగేళ్లపాటు గర్భందాల్చకుండా ఉండాలని సూచించినట్లు చెప్పారు. దాదాపు శిక్షణను పూర్తి చేసుకున్న వీరు వచ్చే జూన్లో తొలిసారి మహిళా జెట్ పైలెటర్లుగా అవతరించనున్నారు.