South Korea: మాతృత్వానికి దూరం.. దూరం!
ఆమె పేరు యెజిన్. టీవీ యాంకర్. ఓ సాయం వేళ స్నేహితురాళ్లతో సరదాగా గడుపుతుండగా మొబైల్లో ఓ పాపులర్ మీమ్ ప్రత్యక్షమైంది. ‘మాలా మీరూ అంతరించిపోకముందే జాగ్రత్త పడండి’ అని ఓ కార్టూన్ డైనోసార్ హితబోధ చేయడం దాని సారాంశం. దాంతో వారందరి మొహాల్లోనూ విషాద వీచికలు. 30 ఏళ్లు దాటుతున్నా వారెవరికీ ఇంకా పిల్లల్లేరు మరి! వారే కాదు, లో చాలామంది
మాతృత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కడి సమాజంలోని సంక్లిష్టతే ఇందుకు ప్రధాన కారణం...! దక్షిణ కొరియా చాలా ముందుంది. దాంతో ఆడవాళ్లలో అత్యధికులు ఉద్యోగులే. ఇంటిపట్టున ఉండేవారు చాలా తక్కువ. అయితే అక్కడ ఏ రంగంలోనైనా పని ఒత్తిళ్లు విపరీతంగా ఉంటాయి. సుదీర్ఘ పనిగంటలు. పైగా తరచూ ఓవర్ టైమ్ చేయడం తప్పనిసరి.
నిరాకరిస్తే ఆ ప్రభావం ప్రమోషన్లతో పాటు చాలారకాలుగా పడుతుంది. దాంతో విపరీతంగా అలసిపోయి ఇంటికొచ్చే భర్తలు పిల్లల బాధ్యతలను అస్సలు పంచుకోరు. పైగా వేతనాలతో పాటు చాలా అంశాల్లో మితిమీరిన. దీనికి తోడు దాల్ చేసేలా కంపెనీలు ఒత్తిడి చేయడం సర్వసాధారణం.
దాంతో పిల్లల్ని కనే క్రమంలో కెరీర్ ఒకసారి వెనకబడితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం. అదీగాక దక్షిణ కొరియాలో జీవన వ్యయం చాలా ఎక్కువ. ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవడం కష్టం. ఇన్ని ప్రతికూలతల మధ్య పిల్లల్ని కని, సజావుగా పెంచేందుకు కావాల్సిన సమయం, ఓపిక, కుటుంబ మద్దతు మహిళలకు ఏ మాత్రమూ ఉండటం లేదు. పిల్లలు, కెరీర్లో ఏదో ఒక్కదాన్నే ఎంచుకోక తప్పని అనివార్య పరిస్థితి. అత్యధికులు రెండో ఆప్షన్‌కే ఓటేస్తున్నారు. అలా మొత్తంగా మాతృత్వానికే దూరమవుతున్నారు!
అట్టడుగుకు జననాల రేటు
ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింట్లోనూ చాలాకాలంగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ దక్షిణ కొరియాలో ఈ ధోరణి మరీ ప్రమాదకరంగా ఉంది. నిజానికి అతి తక్కువ జననాల రేటు విషయంలో 20 ఏళ్లుగా ఆ దేశానిదే ప్రపంచ రికార్డు! పైగా అది ఏటికేడు మరింతగా తగ్గుతూ వస్తోంది. తాజాగా బుధవారం విడుదలైన గణాంకాలైతే ప్రమాద ఘంటికలే మోగిస్తున్నాయి. 2023లో అక్కడ జననాల రేటు (ఒక మహిళ జీవిత కాలంలో కనే పిల్లల సంఖ్య) 8 శాతం తగ్గి కేవలం 0.73గా నమోదైంది. ఇదిలాగే కొనసాగితే 2100 నాటికి దేశ జనాభా సగానికి సగం తగ్గిపోనుంది. దాంతో ఈ పరిణామాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది!
ఫలించని ప్రోత్సాహకాలు...
పిల్లల్ని కనేలా జనాలను ప్రోత్సహించేందుకు దక్షిణ కొరియాలో ప్రభుత్వాలు చేయని ప్రయత్నాల్లేవు. నగదు ప్రోత్సాహకం, ఇంటి కొనుగోలుపై సబ్సిడీ, పిల్లలను చూసుకునేందుకు ఉచితంగా ఆయా సదుపాయం వంటివెన్ని ప్రకటించినా లాభముండటం లేదు. మహిళలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను పరిష్కరించనంత కాలం ఇటువంటి పథకాలు ఎన్ని తెచ్చినా ఒరిగేదేమీ ఉండబోదని
సామాజికవేత్తలు అంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్