నోయిడాలో ‘నిర్భయ సెంటర్’
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
నోయిడా: లైంగిక దాడికి గురైన బాధిత మహిళలకు సత్వరమే సాంత్వన చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్భయ సెంటర్ల మాదిరిగానే ప్రతి జిల్లాలోనూ లైంగిక బాధిత సెంటర్ల ఏర్పాటు చేయడానికి ఓ పథకానికి రూపకల్పన చేసింది. నోయిడా జిల్లా కేంద్ర ఆస్ప్రత్రి పరిధిలో లైంగిక బాధిత సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఆరోగ్యశాఖ నోట్ పంపించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అనుమతి కూడా మంజూరు చేసింది. నోయిడా జిల్లా కేంద్ర ఆస్పత్రి లో 300ల మీటర్ల పరిధిలోనే ఈ సెంటర్‌ను ఏర్పా టు చేయాలని తెలిపింది.
సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తాం: ఆర్‌ఎన్‌పీ మిశ్రా
నోయిడా జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్‌ఎన్‌పీ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ విషయమై జిల్లా మెడికల్ ఆఫీసర్ సమావేశమై, ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తిస్తామని చెప్పారు. డిసెంబర్ 16, 2013 ఢిల్లీలో యువతి బస్సులో వెళ్తుండగా అత్యం దారుణంగా లైంగికదాడికి గురైంది. ఈ ఘటన తర్వాత నిర్భయ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నదని అధికారులు పేర్కొన్నారు.
ఈ సెంటర్‌లో లైంగికదాడికి గురైన మహిళలకు పోలీసుల రక్షణ, వైద్య సదుపాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక నివాసం లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కొన్నిరోజులపాటు ఇక్కడే ఉండొచ్చు, వారికి భోజనం, దుస్తులను కూడా అందజేస్తారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేసేలా సహా యం అందజేస్తారని అధికారులు తెలిపారు.
ఇదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిర్భ య సెంటర్ల మాదిరిగానే లైంగిక బాధితుల సమస్య ల పరిష్కారానికి, న్యాయ సలహాలు తదితర సేవ లు అందజేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నారు.