Affected women
-
తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని కట్టేసి కొట్టారు!
కొమరాడ: అధిక వడ్డీలు ఇస్తానంటూ ఆశ చూపి గ్రామస్తుల నుంచి భారీగా అప్పులు చేసింది. ఆ సొమ్ముతో జల్సాలు చేసింది. చివరకు అప్పులు తీర్చలేనంటూ చేతులెత్తేయడంతో బాధితులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రచ్చబండ వద్ద తాడుతో కట్టేసి కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని సివిని గ్రామానికి చెందిన శోభ గత కొన్ని రోజులుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. అధికంగా వడ్డీలు ఇస్తానంటూ గ్రామస్తుల నుంచి సుమారుగా రూ.1.40 కోట్ల మేర అప్పుచేసింది. డబ్బు తిరిగివ్వాలంటూ వారంతా అడిగేసరికి చేతులెత్తేసింది. దీంతో ఏప్రిల్ 7న కొమరాడ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం కొంత మంది బాధిత మహిళలు, గ్రామస్తులు కలిసి ఆమెను రామమందిరం వద్ద ఉన్న రచ్చబండ స్తంభానికి కట్టేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఆమెను విడిపించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ ప్రయోగమూర్తి చెప్పారు. -
ఆమెకు ఆమే అభయం
సాక్షి, హైదరాబాద్: ఆమెకు ‘ఆమే’అభయం.. ఆమెను వేధిస్తే ఇక అంతే. వెకిలిచేష్టలు, మకిలి మనుషులపై కొరఢా ఝళిపిస్తోంది. పోకిరీలపై ప్రతాపం చూపుతోంది. ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తోంది. పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు.. కార్యాలయాలకు వెళ్లే మహిళలు... షాపింగ్ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చే గృహిణులు... ఇలా ఎవరు ఏ పనిమీద వెళుతున్నా ఎవరైనా వేధిస్తే షీటీమ్‌లు ఇట్టే పట్టేస్తున్నాయి. బాధిత మహిళలకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ షీ బృందాలు గత మూడేళ్లలో 5,432 కేసులు నమోదు చేశాయి. అయితే, వీటిల్లో 4,830 కేసు లు మేజర్లపై, 602 కేసులు మైనర్లు నమోదయ్యాయి. మహిళలను వేధించేవారిలో కాలేజీల విద్యార్థులు, వివిధ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న మరికొందరు ఉన్నట్లు షీ బృందాలు సేకరించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేస్తున్న అవగాహన మంత్రం... బస్టాప్‌లు, ఆటోస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, పనిచేసే ప్రాంతాలు, విద్యాసంస్థలు... ఇలా ఏ ప్రాంతమైనా సరే బాలికలు, యువతులు, మహిళలను వేధిస్తే షీ బృందాలను ఆశ్రయించాలని చేస్తున్న విస్తృత ప్రచారం బాగానే పనిచేస్తోంది. లైంగిక వేధింపులకు గురయ్యే యువతులకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు గత మూడేళ్లలో దాదాపు ఐదువేల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపు పది లక్షల మందిలో మార్పు తీసుకురాగలిగాయి. ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు, గ్రామాలు, మురికివాడ లు, పనిచేసేప్రాంతాల్లో విస్తృతంగా జాగృతి కార్యక్రమాలు నిర్వహించారు. మహిళాచట్టాల గురించి వివరించారు. పోలీసుస్టేషన్లే కాకుండా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈమెయిల్, హాక్ ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రచారం చేయడం అమ్మాయిలకు, మహిళల్లో భరోసా కలిగించింది. ఫలితంగా వాట్సాప్, ఫేస్బుక్, ఈ–మెయిల్, ట్విట్టర్, డయల్ 100 ద్వారా ఫిర్యాదుల తాకిడి పెరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మఫ్టీ దుస్తుల్లో షీ బృందాలు అక్కడికి చేరుకొని వీడియో చిత్రీకరణ ద్వారా ఆకతాయిల వెకిలి చేష్టలను చిత్రీకరించి సాక్ష్యాలుగా కోర్టులో సమరి్పస్తున్నాయి. అతి గారాబంతో దారి తప్పి.. - చిన్నప్పటి నుంచి స్త్రీలపట్ల గౌరవం పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చొరవ చూపకపోవడం - తల్లిదండ్రుల అతి గారాబం - షీ బృందాలకు చిక్కుతున్నవారిలో 19 నుంచి 55 ఏళ్ల వయసువారే ఎక్కువ నోరెళ్లబెడుతున్నారు... ‘మేమేమీ తప్పుచేయలేదంటూ చిలుకపలుకులు పలికే ఈవ్ టీజర్లకు తల్లిదండ్రుల సమక్షంలోనే వీడియో ప్రదర్శించడంతో కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ‘మేం పట్టుకున్న ఈవ్‌టీజర్లలో 80 శాతం మంది రోజూ సిగరెట్లు తాగుతున్నారు. వారాంతాల్లో మద్యం పారీ్టలు చేసుకుంటున్నారు. హుక్కా కేంద్రాలకు వెళ్తూ మత్తును రుచిచూస్తున్నారు’ అని షీ టీమ్ సభ్యులు తెలిపారు. కౌన్సెలింగ్‌తో మార్పు కనబడుతోంది... షీ బృందాలకు చిక్కిన ఆకతాయిలకీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మార్పు వస్తోంది. పశ్చాత్తాపపడేలా చేయడంతోపాటు మరోమారు ఈవ్‌టీజింగ్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. వేధింపులపై ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం. ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. – అనసూయ, సైబరాబాద్ షీ టీమ్ ఇన్చార్జి మనస్తత్వం మంచిగా ఉండేలా చూడాలి పిల్లల ముందే ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడటం కూడా ఎదుటివారంటే లెక్కలేనితనాన్ని పెంచుతుంది. మగపిల్లలకు ఇష్టానుసారంగా డబ్బులు, స్వేచ్ఛ ఇవ్వడం వల్ల దారి తప్పుతున్నారు. అమ్మాయి కనబడితే కామెంట్ చేయడం మామూలు విషయమేనని భావిస్తున్నారు. అందుకే చిన్నప్పుడే పిల్లల మనస్తత్వం బాగుండేలా చూడాలి.. – లావణ్య, క్లినికల్ సైకోథెరపిస్ట్ -
నెలరోజులు ప్రత్యక్ష నరకం..
* అరబ్ షేక్‌ల చెర నుంచి మహిళలకు విముక్తి * చెప్పలేని పనులు చేయించారు * తిరిగివస్తామనుకోలేదు:బాధిత మహిళలు చాంద్రాయణగుట్ట : ‘‘ పేదరికాన్ని ఆసరాగా చేసుకున్నారు. నెలకు రూ. 30 వేలు జీతం వచ్చేలా చూస్తామన్నారు. గత నెల 19న అబుదాబీకి పంపారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించవచ్చని ఆశపడ్డాం. తీరా అక్కడికి వెళితే షేక్‌లు గదిలో బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. నెల రోజులుగా ప్రత్యక్షనరకాన్ని అనుభవించాం’’అంటూ దళారులు చేతుల్లో మోసపోయిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్‌షేక్‌ల చెర నుంచి మహిళలను చంద్రాయణగుట్ట పోలీసులు సురక్షితంగా ఆదివారం నగరానికి తీసుకువచ్చారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ, బాధిత మహిళలతో కలసి వివరాలను విలేకరులకు తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామానికి చెందిన ముంతాజ్ బేగం (37), హసీనా బేగం (35) హైదరాబాద్ పాతబస్తీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటూ కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్నారు. వీరి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న బార్కాస్ ప్రాంతానికి చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్ దుబాయిలో వంటింటి పనులు చేస్తే నెలకు 20-30 వేలు ఇస్తారని నమ్మించారు. తమ జీవితాలతో పాటు పిల్లలు జీవితాలు మెరుగుపడతాయని ముంతాజ్ బేగం, హసీనా బేగం ఆశపడ్డారు. గత నెల 19న అబుదాబీ వెళ్లారు. ఇందుకు వీరి నుంచి దళారులు 30 వేల చొప్పున వసూలు చేశారు. తీరా అక్కడికి వెళ్లాక వారికి అసలు విషయం తెలిసి ఖంగుతిన్నారు. వారిని గదిలో బంధించి చిత్ర హింసలకు గురి చేశారు. షేక్‌లు లైంగిక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు చిత్రహింసలకు గురిచేశారు. పది రోజుల కిందట ముంతాజ్ బేగానికి గుండెనొప్పి వచ్చింది. ఆమెకు ఏదైనా జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన షేక్‌లు ముంతాజ్ బేగాన్ని హైదరాబాదాద్కు పంపించారు. ఇక్కడికి వచ్చిన అనంతరం ఆమె షేక్‌ల అరాచకాలపై చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బార్కాస్ చెందిన దళారులు ఫాతిమా, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నారు. షేక్‌ల చెరలో ఉన్న హసీనా బేగాన్ని ఇక్కడికి తీసుకువచ్చేలా ఒత్తిడి చేశారు. దుబాయి దళారులతో వారు మాట్లాడి హసీనాను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు హసీనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పోలీసులు వెంటనే హసీనాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఈ ఘటనపై ఇంతియాజ్, ఫాతిమాలపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీసీపీ స్యతనారాయణ తెలిపారు. దళారులు ఇంకెవరినైనా ఇలా దుబాయికి పంపించారా...? అన్న విషయాన్ని విచారిస్తున్నామన్నారు. ముంతాజ్, హసీనాలను చిత్ర హింసలకు గురి చేసిన షేక్‌లకు కూడా సీఐడీ సహకారంతో నోటీసులు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తుచేస్తున్నామన్నారు.విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, చాంద్రాయణగుట్ట అదనపు ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేందర్, ఎస్సై లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాధితురాలిని సురక్షితంగా తీసుకొచ్చేలా కృషి చేసిన చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్, ఎస్సైలకు రివార్డులను అందిస్తామని డీసీపీ తెలిపారు. తిరిగి వస్తామనుకోలేదు: బాధిత మహిళలు తాము తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని బాధిత మహిళలు ముంతాజ్, హసీనా కన్నీటిపర్యంతమయ్యారు. రోజుల తరబడి భోజనం పెట్టకుండా చిత్ర హింసలకు గురిచేశారని, నిర్భందించి చెప్పుకోలేని పనులు చేయించారన్నారు. తమ లాంటి వారు చాలా మంది తెలియక దుబాయికి వెళ్లి నరకం అనుభవిస్తున్నారన్నారు. అలాంటి వారందరిని ఇక్కడికి తీసుకురావాలన్నారు. ఒంటిపై నగలను లాక్కొన్నారని హసీనా ఆవేదన చెందింది. -
నోయిడాలో ‘నిర్భయ సెంటర్’
జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం నోయిడా: లైంగిక దాడికి గురైన బాధిత మహిళలకు సత్వరమే సాంత్వన చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్భయ సెంటర్ల మాదిరిగానే ప్రతి జిల్లాలోనూ లైంగిక బాధిత సెంటర్ల ఏర్పాటు చేయడానికి ఓ పథకానికి రూపకల్పన చేసింది. నోయిడా జిల్లా కేంద్ర ఆస్ప్రత్రి పరిధిలో లైంగిక బాధిత సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచిస్తూ ఆరోగ్యశాఖ నోట్ పంపించింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అనుమతి కూడా మంజూరు చేసింది. నోయిడా జిల్లా కేంద్ర ఆస్పత్రి లో 300ల మీటర్ల పరిధిలోనే ఈ సెంటర్‌ను ఏర్పా టు చేయాలని తెలిపింది. సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తాం: ఆర్ఎన్పీ మిశ్రా నోయిడా జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్ఎన్పీ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామని చెప్పారు. ఈ విషయమై జిల్లా మెడికల్ ఆఫీసర్ సమావేశమై, ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని గుర్తిస్తామని చెప్పారు. డిసెంబర్ 16, 2013 ఢిల్లీలో యువతి బస్సులో వెళ్తుండగా అత్యం దారుణంగా లైంగికదాడికి గురైంది. ఈ ఘటన తర్వాత నిర్భయ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకొన్నదని అధికారులు పేర్కొన్నారు. ఈ సెంటర్లో లైంగికదాడికి గురైన మహిళలకు పోలీసుల రక్షణ, వైద్య సదుపాయం, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, తాత్కాలిక నివాసం లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కొన్నిరోజులపాటు ఇక్కడే ఉండొచ్చు, వారికి భోజనం, దుస్తులను కూడా అందజేస్తారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసేలా సహా యం అందజేస్తారని అధికారులు తెలిపారు. ఇదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ నిర్భ య సెంటర్ల మాదిరిగానే లైంగిక బాధితుల సమస్య ల పరిష్కారానికి, న్యాయ సలహాలు తదితర సేవ లు అందజేయడానికి కేంద్రాలను ఏర్పాటు చేయ నున్నారు.