బీమాకోసం దత్తపుత్రుడిని చంపించిన ఎన్నారైలు | NRI Couple Allegedly Had Adopted Teen Son Killed For Insurance Money | Sakshi
Sakshi News home page

బీమాకోసం దత్తపుత్రుడిని చంపించిన ఎన్నారైలు

Published Wed, Feb 15 2017 8:59 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

బీమాకోసం దత్తపుత్రుడిని చంపించిన ఎన్నారైలు - Sakshi

బీమాకోసం దత్తపుత్రుడిని చంపించిన ఎన్నారైలు

అహ్మదాబాద్‌: ఎన్నారై దంపతులు దారుణానికి ఒడిగట్టారు. బీమా సొమ్ముకోసం ఆశపడి తాము దత్తత తీసుకున్న కుమారుడిని హత్య చేయించారు. ఈ ఘటన గుజరాత్‌లోని జునాఘడ్‌ జిల్లా కెశోద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్తీ లోక్‌నాథ్‌(53), కన్వాల్జిసిన్హ్‌ రాయిజాదా(28) దంపతలు. వారు ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. వారికి ఒక దత్త పుత్రుడు ఉన్నాడు. అతడి పేరు గోపాల్‌(13). ప్రస్తుతం ఆ బాలుడు అహ్మదాబాద్‌లో ఉంటున్నాడు. అతడి పేరిట దాదాపు రూ.కోటి 20లక్షల బీమా ఉంది. అతడిని చంపేయడం ద్వారా ఆ డబ్బును ఇప్పుడే క్లెయిమ్‌ చేసుకోవచ్చని భావించిన వారు నితీశ్‌ ముండే అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అంతకుముందు లండన్‌లోనే ఉన్న నితీశ్‌ ప్రస్తుతం గుజరాత్‌ వచ్చాడు. అనంతరం 2015లో గోపాల్‌ను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకొని అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరకు ఈ ఏడాది (2017) ఫిబ్రవరి 8న జునాఘడ్‌ జిల్లాలోని కెశోద్‌ప్రాంతంలో ఆ బాలుడిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా కత్తులతో దాడి చేయించాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ వచ్చిన ఆ బాలుడి సోమవారం చనిపోయాడు. ఈ కేసును విచారించిన పోలీసులు సోమవారం రోజే నితీశ్‌ను అరెస్టు చేసి విచారించగా అసలు విషయం బయటకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement