రాయ్‌బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉంచాహర్ ఎన్టీపీసీ కేంద్రంలో చోటుచేసుకున్న పేలుడులో మృతుల సంఖ్య 29కి పెరిగింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ గురువారం మరో 9 మంది మృత్యువాత పడ్డారని అధికారులు వెల్లడించారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఆర్కే సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిర్ణీత సమయానికన్నా ముందే ఈ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభించారన్న ఆరోపణలను ఆర్కే సింగ్ కొట్టిపారేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆర్కే సింగ్ వెల్లడించారు. దీనికి అదనంగా, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. పేలుడుపై యూపీ ప్రభుత్వం మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment