గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడి అరెస్ట్‌ | Officer Close to Gali Janardhana Reddy Arrested After Suicide Note Alleges Money Laundering | Sakshi
Sakshi News home page

గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడి అరెస్ట్‌

Published Sun, Dec 11 2016 1:50 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడి అరెస్ట్‌

గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడి అరెస్ట్‌

బెంగళూరు: పారిశ్రామికవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డికి సన్నిహితుడైన ఉన్నతాధికారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరులో ప్రత్యేక భూ సేకరణ అధికారిగా పనిచేస్తున్న భీమా నాయక్, అతడి వ్యక్తిగత డ్రైవర్ మహ్మద్‌ లను ఆదివారం గుల్బర్గాలో అదుపులో తీసుకున్నారు.

నాయక్ దగ్గర అంతకుముందు డ్రైవర్ గా పనిచేసిన కేసీ రమేశ్ గౌడ ఆత్మహత్య కేసులో వీరిని అరెస్ట్‌ చేశారు. మాండ్యలోని ఓ లాడ్జీలో రమేశ్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గాలి జనార్దన రెడ్డికి చెందిన రూ.100 కోట్ల పాత నోట్లను 20 శాతం కమీషన్‌ తీసుకుని నాయక్ మర్చారని రమేశ్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. ఇవన్నీ తనకు తెలియటంతో చంపించేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. భీమ్ నాయక్ అక్రమ సంపాదన, అక్రమాస్తుల వివరాలనూ రమేశ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. నాయక్, ఆయన వ్యక్తిగత డ్రైవర్ మొహమ్మద్‌లే తన ఆత్మహత్యకు కారణమని వెల్లడించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement