
బళ్లారి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బళ్లారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమశేఖర్‌రెడ్డి.. తనదే విజయం అని స్పష్టం చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి భార్య బరిలోకి దిగుతున్నప్పటికీ విజయం మాత్రం తనదేని నొక్కి చెప్పారు సోమశేఖర్‌రెడ్డి. గాలి జనార్థన్‌రెడ్డి పేరు అక్కడక్కడ వినిపిస్తున్నా, ఆయన పబ్లిక్‌తో ఎటువంటి సంబంధాలు లేవన్నారు. పబ్లిక్‌తో ఉండేది తానేనని సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో తామంతా గాలి జనార్థన్‌రెడ్డి ఉన్పామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సోదరుడు సోమశేఖర్‌రెడ్డి. పక్కా కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని, అది తన గెలుపునకు దోహదం చేస్తుందన్నారు. డబ్బులకు ఆశ పడే వాళ్లు మాత్రమే గాలి జనార్థన్‌రెడ్డి వైపుకు వెళ్తున్నారని, నిజమైన కార్యకర్తలు మాత్రం తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు.
ఇదిలా ఉంచితే, గాలి జనార్థన్‌రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష(కేఆర్‌పీ)పార్టీ తరఫున ఆయన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తున్నారు. కాగా, కర్నాటక ఎన్నికలకు సంబంధించి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు. కర్నాటక ఎన్నికల్లో మేమే కీలకం కాబోతున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మా రాజకీయ ప్రత్యర్ధులు బీజేపీ - కాంగ్రెస్. బసవేశ్వర సిద్ధాంతాలే మా అజెండా. కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment