gali Somasekhara Reddy
-
గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బళ్లారి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గాలి జనార్థన్‌రెడ్డిపై సోదరుడు సోమశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బళ్లారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమశేఖర్‌రెడ్డి.. తనదే విజయం అని స్పష్టం చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి భార్య బరిలోకి దిగుతున్నప్పటికీ విజయం మాత్రం తనదేని నొక్కి చెప్పారు సోమశేఖర్‌రెడ్డి. గాలి జనార్థన్‌రెడ్డి పేరు అక్కడక్కడ వినిపిస్తున్నా, ఆయన పబ్లిక్‌తో ఎటువంటి సంబంధాలు లేవన్నారు. పబ్లిక్‌తో ఉండేది తానేనని సోమశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అదే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తామంతా గాలి జనార్థన్‌రెడ్డి ఉన్పామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు సోదరుడు సోమశేఖర్‌రెడ్డి. పక్కా కార్యకర్తలంతా తమతోనే ఉన్నారని, అది తన గెలుపునకు దోహదం చేస్తుందన్నారు. డబ్బులకు ఆశ పడే వాళ్లు మాత్రమే గాలి జనార్థన్‌రెడ్డి వైపుకు వెళ్తున్నారని, నిజమైన కార్యకర్తలు మాత్రం తమ పార్టీ వెంటే ఉన్నారన్నారు. ఇదిలా ఉంచితే, గాలి జనార్థన్‌రెడ్డి స్థాపించిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష(కేఆర్పీ)పార్టీ తరఫున ఆయన భార్య అరుణ లక్ష్మి పోటీ చేస్తున్నారు. కాగా, కర్నాటక ఎన్నికలకు సంబంధించి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ అధ్యక్షుడు గాలి జనార్ధన్ రెడ్డి స్పందించారు. కర్నాటక ఎన్నికల్లో మేమే కీలకం కాబోతున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మా రాజకీయ ప్రత్యర్ధులు బీజేపీ - కాంగ్రెస్. బసవేశ్వర సిద్ధాంతాలే మా అజెండా. కులాలు, మతాలకు అతీతంగా సేవ చేసేందుకే రాజకీయ పార్టీ స్థాపించాను’ అని అన్నారు. -
ఒకే వేదికపై నారా, గాలి!
సాక్షి, బళ్లారి (కర్ణాటక): రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నానుడి. శుక్రవారం బళ్లారిలో జరిగిన ఓ క్రికెట్ టోర్నీ వేడుకకు హాజరైన బీజేపీ ఎమ్మె ల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డిలు ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీల పరంగా వైరం ఉన్నా వాటిని పక్కనపెట్టి కొద్దిసేపు ఈ ఇద్దరు నేతలు ముచ్చటించుకోవడం గమనార్హం. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) -
కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి
బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి కంప్లి :కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. కురుగోడు పురసభకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు. పురసభ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆయన 4వ వార్డు బీజేపీ అభ్యర్థి ప్రమీలతో కలిసి సోమవారం పురసభ కార్యాలయం చేరుకొని ఎన్నికల అధికారి రవీంద్రకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి పేదల సమస్యలపై స్పందించి అనేక పథకాలు జారీ చేస్తున్నారన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రాజకీయ కురు వృద్ధుడు, యడ్యూరప్పకు అందించడంతో పార్టీకి కొండంత బలం చేకూరిందన్నారు. కంప్లి క్షేత్రంలోని ప్రజలు బీజేపీపై ఎంతో అభిమానంతో ఎమ్మెల్యే సురేష్‌బాబుకు వెన్నంటి ఉన్నారని, ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 18 నుంచి 20 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. కంప్లి క్షేత్ర అధ్యక్షుడు యువరాజ్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి అనిల్, యర్రంగిళి తిమ్మారెడ్డి, హరీష్‌రెడ్డి, బెసేజ్రెడ్డి, ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.