కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి | Congress paid farina | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయి

Published Tue, Apr 12 2016 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Congress paid farina

బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి


కంప్లి :కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లాయని బళ్లారి సిటీ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. కురుగోడు పురసభకు జరగనున్న ఎన్నికల్లో  కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు. పురసభ ఎన్నికల సందర్భంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఆయన 4వ వార్డు బీజేపీ అభ్యర్థి ప్రమీలతో కలిసి సోమవారం  పురసభ కార్యాలయం చేరుకొని ఎన్నికల అధికారి రవీంద్రకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  కేంద్రంలో ప్రధానమంత్రి పేదల సమస్యలపై స్పందించి అనేక పథకాలు జారీ చేస్తున్నారన్నారు.


ఇక రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రాజకీయ కురు వృద్ధుడు,  యడ్యూరప్పకు అందించడంతో పార్టీకి కొండంత బలం చేకూరిందన్నారు. కంప్లి క్షేత్రంలోని ప్రజలు బీజేపీపై ఎంతో అభిమానంతో  ఎమ్మెల్యే సురేష్‌బాబుకు వెన్నంటి ఉన్నారని, ఈ ఎన్నికల్లో 23 వార్డులకు గాను 18 నుంచి 20 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతారన్నారు. కంప్లి క్షేత్ర అధ్యక్షుడు యువరాజ్, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి అనిల్, యర్రంగిళి తిమ్మారెడ్డి, హరీష్‌రెడ్డి, బెసేజ్‌రెడ్డి, ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement