జీపు బానెట్‌కు కట్టేసిన ఆర్మీ ఆఫీసర్‌కు సత్కారం | Officer Who Tied Protester To Jeep As 'Human Shield' Honoured By Army | Sakshi
Sakshi News home page

జీపు బానెట్‌కు కట్టేసిన ఆర్మీ ఆఫీసర్‌కు సత్కారం

Published Mon, May 22 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM

Officer Who Tied Protester To Jeep As 'Human Shield' Honoured By Army

కశ్మీర్‌: కశ్మీర్‌లో వేర్పాటువాదుల రాళ్ల దాడి నుంచి బయటపడే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని జీపు బానట్‌కు కట్టి ఆందోళనలు నిలువరించే ప్రయత్నం చేసిన మేజర్ లీతల్‌ గోగోయ్‌ అనే సైనికాధికారికి భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అవార్డుతో సత్కరించారు.

మిలిటరీ వర్గాల సమచారం ప్రకారం ఆయనకు బిపిన్‌ రావత్‌ అత్యున్నత ప్రోత్సాహక అవార్డును అందించినట్లు తెలిసింది. చొరబాటుదారులను నిలువరించేందుకు, ఆందోళనలు సర్దుమణిగేలా చేసే ప్రయత్నం చేసినందుకు ఆయనకు ఈ అవార్డును ఇచ్చినట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement